Telugu New Year celebrations in Washington
ముగిసిన ప్రవాసాంధ్రుల ఉగాది సంబరాలు
వాషింగ్టన్, మే10: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వేడుకలను అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఘనంగా జరుపుకున్నారు. గత నెల రోజులుగా జరిగిన వ్యయనామ సంవత్సరాది వేడుకలు విజయవంతంగా ముగిశాయి. స్థానిక ప్రవాసాంధ్ర సంస్థలు నిర్వహించిన ఈ సంబరాల్లో ప్రవాసాం«ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఇతర ప్రవాసాంధ్ర సంస్థలతో కలిసి వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన ఉగాది వేడుకలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై మే 6తో ముగిశాయి.
మొదట తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్ న్యూయార్క్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ప్రముఖ తెలుగు సినీనటుడు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి చైర్మన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమిటీ స్థానిక అధ్యక్షుడు కంభంపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకల్లో ప్రవాసాంధ్రలు ఉత్సాహాంగా పాల్గొన్నారు. బాబురావు పోలవరపు నేతృత్వంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ సంస్థ నిర్వహించిన ఉగాది అందరినీ అలరించాయి.
రామకృష్ణ సీతల ఆధ్వర్యంలో తెలుగు ఫైన్ ఆర్ట్స్ ఒకరోజు మొత్తం నిర్వహించిన ఉగాది వేడుకల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. ఈ పోటీల్లో పాల్గొన్న పోటీదారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడం విశేషం. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ వాషింగ్టన్ నిర్వహించిన ఉగాది సంబరాల్లో అత్యధిక సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
చివరిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ డెల్‌వారి వాలీ, ఫిలడెల్ఫియా నిర్వహించిన ఉగాది వేడుకలతో ఈ సంబరాలు ముగిశాయి. ఈ వేడుకలకు సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు కుటుంబంతో సహా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు మధు యాష్కిగౌడ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా సాంస్కృతిక చైర్మన్ సరోజ సాగరం, వైస్ చైర్మన్ దాము గేదెల సహాయంతో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించారు.
ఈ వేడుకలు విజయవంతం కావడంలో ఫిలడెల్ఫియాకు చెందిన టిఎజిడివి అధ్యక్షులు హర నాథ్ దొడ్డపనేని కీలకపాత్ర పోషించారు.
నెల రోజుల పాటు తెలుగు వారి సంస్కృతిని ప్రతిబింబిస్తూ విదేశీ గడ్డపై ఉగాది పండును ప్రవాసాంధ్రులు వేడుకగా జరుపుకున్నారు. స్థానిక ప్రవాసాంధ్ర సంస్థలను అనుసంధానించి ఉగాది వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో తానా కృషి ప్రశంసనీయం.
Courtesy: ఆంధ్ర జ్యోతి
0 Comments:
Post a Comment
<< Home