'కాలచక్ర' అతిథుల సత్కారాలకు సన్నాహాలు
కలెక్టరేట్, డిసెంబరు 16 (న్యూస్టుడే) : కాలచక్ర ఉత్సవాలకు విచ్చేసే అతిథులను సత్కరించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ బి.రాహుల్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో సత్కార కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. సన్మానానికి అవసరమైన శాలువాలను ఆకర్షణీయంగా తయారు చేయాలని చేనేతశాఖ అధికారులకు సూచించారు. శాలువాలపై 'కాలచక్ర' లోగోతోపాటు జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి లోగోను కూడా తప్పనిసరిగా ముద్రించాలని ఆదేశించారు. ఇలాంటి శాలువాలను జిల్లాలోని నేత కార్మికుల నుంచే కాకుండా ఇతర జిల్లాల కార్మికుల నుంచి కూడా తెప్పించాలని చెప్పారు. 'కాలచక్ర' విజయవంతానికి స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరించాలని జేసీ కోరారు. మాజేటి పాపారావు మాట్లాడుతూ తాము సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వెలుగు ప్రాజక్టు డైరెక్టర్ పి.భాస్కర్, జిల్లా నీటియాజమాన్యసంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రాజశేఖరరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ మల్లిఖార్జునరావు, చేనేత జౌళిశాఖ సహయ సంచాలకులు ఎల్.వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005
0 Comments:
Post a Comment
<< Home