"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, October 18, 2006

నెట్‌ అంతా మీ జేబులో!

కప్పుడు విజ్ఞాన సర్వస్వాలు చేసిన పనిని ఈరోజు సెర్చింజిన్లు చేస్తున్నాయి. దేని గురించి సమాచారం కావాలన్నా క్షణాల్లో మనముందు తెచ్చిపెడుతున్నాయి. కానీ, అవసరం ఉన్న ప్రతి సందర్భంలోనూ ఇంటర్నెట్‌ మనకు అందుబాటులో ఉంటుందని చెప్పలేం. అలాంటప్పుడు సెర్చింజిన్‌ కావాలంటే... వెబరూవైపు చూడాల్సిందే.

సా
ఫ్ట్‌వేర్‌ ప్రపంచానికి భారతీయ మేథస్సు అందించిన కానుక వెబరూ. ఐఐటీ ముంబై ఇంజనీరింగ్‌ విద్యార్థులు దీన్ని రూపొందించారు. దైనందిన జీవితంలో ఇది ఎలా ఉపయోగపడుతుందో రెండు ఉదాహరణల ద్వారా చూద్దాం.

* ఏదో పనిమీద హైదరాబాద్‌ వెళ్లారు. కాస్త సమయం ఉండటంతో అలా తిరిగొద్దామని బయల్దేరారు. చార్మినార్‌ చేరుకున్నారు. చూస్తూ ఉంటే ఆ చారిత్రక కట్టడం నేపథ్యం, విశేషాలు తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే జేబులోంచి సెల్‌ఫోన్‌ తీసి వెబరూ సాఫ్ట్‌వేర్‌ను ఒపెన్‌ చేసి చార్మినార్‌ అని టైప్‌ చేశారు. అంతే క్షణాల్లో సమస్త విశేషాలు మీ ముందు ప్రత్యక్షం.

* కాలేజీలో మీరూ, మీ మిత్రుడూ ఒక పుస్తకంపైన మాట్లాడుకుంటున్నారు. ఆ పుస్తకం రచయిత, రచనా కాలం గురించి మీ ఇద్దరి అభిప్రాయాలు కలవట్లేదు. ఏది సరైందో తెలుసుకోవటానికి మీ దగ్గరున్న పీడీఏ (పర్సనల్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌)ను తీసి ఆ పుస్తకం పేరుతో సెర్చ్‌ చేశారు. వివరాలన్నీ వచ్చేశాయి.

అంటే విజ్ఞానసర్వస్వం మీ జేబులోకి వచ్చేసిందన్నమాట. మరోమాటలో చెప్పాలంటే నెట్‌ కనెక్షన్‌తో పని లేకుండా మీతోపాటే ఎక్కడంటే అక్కడికి వచ్చే సెర్చింజిన్‌ ఇది. ఎలా సాధ్యమైంది?
సొంత అనుభవంలోంచి...
మూడేళ్లక్రితం రాకేష్‌ మాథుర్‌ తన మిత్రుడు బ్రాడ్లీ హుసిక్‌తో కలిసి అమెరికాలోని అలస్కాలో పర్యటించారు. అక్కడి విశేషాలు వారికి ఆసక్తి కలిగించాయి. వివరాలేమిటో తెలుసుకుందామంటే ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో లేదు. అప్పుడే నెట్‌తో సంబంధం లేని సెర్చింజిన్‌ అన్న ఆలోచన తట్టింది. దాన్ని ముంబై ఐఐటీ విద్యార్థులతో పంచుకున్నారు. అందరి ప్రయత్నాల వల్ల వెబరూ సాఫ్ట్‌వేర్‌ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం దీన్ని అమెరికా, భారత్‌లను కేంద్రంగా చేసుకొని విస్తృత వినియోగంలోకి తేవటానికి రాకేష్‌ సారథ్యంలోని వెబరూ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను www.webaroo.com సైట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ఇది నడవటానికి కంప్యూటర్‌లో విండోస్‌ ఎక్స్‌పీ లేదా విండోస్‌ 2000 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉండాలి. సెల్‌ తదితర మొబైల్‌ పరికరాలయితే విండోస్‌ పాకెట్‌ పీసీ 2003 ఎస్‌ఈ లేదా విండోస్‌ మొబైల్‌ 5.0 ఉండాలి. ఇతర ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలోనూ నడిచేలా వెబరూ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.
వెబరూ పని చేసేదిలా
వెబరూ కంపెనీకి చెందిన సర్వర్లు ఇంటర్నెట్‌ను వెదికి వివిధ అంశాలకు సంబంధించిన అసంఖ్యాక వెబ్‌సైట్లను, పేజీలను పట్టుకుంటాయి. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన ఆల్గరిథమ్స్‌ ఈ సమాచారాన్నంతటినీ విశ్లేషిస్తాయి. తద్వారా ఒక్కో అంశానికి సంబంధించిన అప్రధాన సమాచారాన్ని తొలగించి ముఖ్యమైన సమాచారాన్ని ఒక దగ్గర పోగుచేస్తాయి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఆ సమాచారాన్ని కుదించి 'వెబ్‌ప్యాక్‌' రూపంలో సిద్ధం చేస్తుంది. ఈ విధంగా తయారైన వెబ్‌ప్యాక్‌లు వెబరూ సైట్లో దాదాపు 400 వరకూ ఉన్నాయి. వీటిని రాజకీయాలు, సంస్కృతి, వార్తలు, క్రీడలు, వ్యక్తులు, ఆరోగ్యం, పర్యాటకస్థలాలు, టెక్నాలజీ, వికిపిడియా వంటి వివిధ విభాగాల కింద వర్గీకరించారు. వీటిల్లోంచి నచ్చిన వాటిని ముందుగా కంప్యూటర్లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ల్యాప్‌టాప్‌, పీడీఏ, సెల్‌ఫోన్‌ వంటి మొబైల్‌ పరికరాల్లోకి మార్చుకోవచ్చు. దీంతో సెర్చింజిన్‌ మీతోపాటు ఎక్కడికంటే అక్కడికే వచ్చేస్తుంది. ఆయా అంశాలకు సంబంధించిన తాజా సమాచారం కావాలనుకున్నప్పుడు వెబరూ సైట్‌లోకి వెళ్లి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.
ఏ రంగంలోనైనా మౌలికమార్పులను తీసుకొచ్చినప్పుడు అవి గొప్ప సంచలనాలను నమోదు చేస్తాయి. సెర్చింజిన్‌ రంగంలో కొత్త విధానాలను ప్రవేశపెట్టటం వల్లనే గూగిల్‌ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా ఎదిగింది. వెబరూ కూడా అంతటి ప్రాధాన్యత ఉన్న సేవలనే తీసుకొచ్చింది. మరి, ఇంటర్నెట్‌ ప్రపంచం వీటిని ఎలా ఆదరిస్తుందో చూడాల్సిందే.

వికీపీడియా, న్యూయార్క్‌టైమ్స్‌!
వెబరూ వెబ్‌ప్యాకుల్లో వికీపీడియా (ఇంగ్లిష్‌), న్యూయార్క్‌ టైమ్స్‌ కూడా ఉన్నాయి. వికీపీడియా ఇంగ్లిష్‌ వర్షన్‌లో ఉన్న వ్యాసాల సంఖ్య 10 లక్షలు. ఇక న్యూయార్క్‌ టైమ్స్‌ సైట్లో 150 ఏళ్ల కిందటి వార్తలు కూడా లభిస్తాయి. వీటిని ఎప్పుడంటే అప్పుడు సెర్చ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది వెబరూ. ఇంత భారీ సమాచారానికి ఎంత స్పేస్‌ కావాలో అని భయపడాల్సిన పని లేదు. ఈ సమాచారాన్ని వీలైనంతమేరకూ కుదించే వెబ్‌ప్యాకులను తయారు చేస్తున్నారు. ఫలితంగా వికీపీడియా 6 గిగాబైట్లలో వచ్చేస్తోంది.
ఇబ్బందులు ఉండవు
మొబైల్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీటి వినియోగం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేగాక, పూర్తిస్థాయిలో ఆధారపడేంతగా ఇవి అభివృద్ధి కాలేదు. ఈ నేపథ్యంలో వెబరూ మంచి ప్రత్యామ్నాయం. దీంతో నెలవారీ అద్దెలన్నవి ఉండవు. కనెక్షన్‌ స్పీడ్‌ తక్కువగా ఉందన్న సమస్య అసలే ఉండదు.

Courtesy: ఈనాడు


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


2 Comments:

At 9:45 PM, Blogger Uma గారు చెప్పినారు...

hi kiran, i tried webaroo many days back. their idea is good, but not so innovative. to avail the features, first we must download the entire site, so that it cld be indexed into our COMP or PDA.

This can be easily donw with website downloaders, and indexing cld be automatically done with windows indexing tool. But only thing is they hav interface with mobiles and PDAs.

 
At 2:56 AM, Blogger  గారు చెప్పినారు...

A片,A片,成人網站,成人影片,色情,情色網,情色,AV,AV女優,成人影城,成人,色情A片,日本AV,免費成人影片,成人影片,SEX,免費A片,A片下載,免費A片下載,做愛,情色A片,色情影片,H漫,A漫,18成人

a片,色情影片,情色電影,a片,色情,情色網,情色,av,av女優,成人影城,成人,色情a片,日本av,免費成人影片,成人影片,情色a片,sex,免費a片,a片下載,免費a片下載,成人網站,做愛,自拍

情趣用品,情趣用品,情趣,情趣,情趣用品,情趣用品,情趣,情趣,情趣用品,情趣用品,情趣,情趣

A片,A片,A片下載,做愛,成人電影,.18成人,日本A片,情色小說,情色電影,成人影城,自拍,情色論壇,成人論壇,情色貼圖,情色,免費A片,成人,成人網站,成人圖片,AV女優,成人光碟,色情,色情影片,免費A片下載,SEX,AV,色情網站,本土自拍,性愛,成人影片,情色文學,成人文章,成人圖片區,成人貼圖

情色,AV女優,UT聊天室,聊天室,A片,視訊聊天室


UT聊天室,視訊聊天室,辣妹視訊,視訊辣妹,情色視訊,視訊,080視訊聊天室,視訊交友90739,美女視訊,視訊美女,免費視訊聊天室,免費視訊聊天,免費視訊,視訊聊天室,視訊聊天,視訊交友網,視訊交友,情人視訊網,成人視訊,哈啦聊天室,UT聊天室,豆豆聊天室,
聊天室,聊天,色情聊天室,色情,尋夢園聊天室,聊天室尋夢園,080聊天室,080苗栗人聊天室,柔情聊天網,小高聊天室,上班族聊天室,080中部人聊天室,中部人聊天室,成人聊天室,成人

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home