న్యూజెర్సీలో ఘనంగా 'తెలుగు కళాసమితి' దీపావళి సంబరాలు
Telugu Kala Samithi Diwali celebrations in New Jersey
న్యూజెర్సీ,నవంబర్ 21: తెలుగు కళాసమితి (టిఎఫ్‌ఎఎస్)ఆధ్వర్యంలో న్యూజెర్సీలో గత శనివారందీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. న్యూజెర్సీలోని ప్రిన్సెటన్ జంక్షన్‌లోగల థామస్ గ్రోవర్ మిడిల్ స్కూల్ ఈ వేడుకులకు వేదికగా నిలిచింది. టిఎఫ్‌ఎఎస్‌కు చెందిన చిన్నారుల వందేమాతరం గీతాలాపనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. అనంతరం నృత్యాంజలి డ్యాన్స్ స్కూల్‌కు చెందిన వర్ష, దర్షిని, స్మిత, కీర్తన, నికిత, అక్షర, షర్మిలు 'శుభోదయం' అంటూ.. దీపావళి దివ్వెలతో వెలుగులు విరజిమ్మారు. ఆపై నృత్య మాధవి డ్యాన్స్ స్కూల్ విద్యార్థులు రేఖ, సౌజన్య, స్వర్న, చంద్రలేఖ, అపూర్వలు ప్రదర్శించిన 'కొలువైతివా రంగ సాయి' అంటూ చేసిన నృత్యం ప్రేక్షకులను అలరించింది.
అనంతరం టిఎఫ్‌ఎఎస్ అధ్యక్షులు రామకృష్ణ సీతాలా స్వాగతోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి వెస్ట్ విండ్సర్ మేయర్ షింగ్-ఫు-సూయ్, కౌన్సెటేట్ జనరల్ ఆఫ్ ఇండియా నీలమ్ దియో ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీపావళి ప్రాముఖ్యతను వివరిస్తూ నీలమ్ ప్రసంగించారు. అలాగే తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని వివరించారు. బెంగాలీ, తెలుగులు తీయని భాషలుగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్నవారకి టిఎఫ్‌ఎఎస్ అవార్డులను అందజేసింది. నాటక రంగంలో అప్పాజోస్యుల సత్యనారాయణ, విజ్ఞాన శాస్త్రంలో సత్యం చెరుకూరి, చిత్రరంగంలో శాంతికుమార్ చిలుముల, శాస్త్రీయ నృత్యంలో సుధా దేవులపల్లి, కర్ణాటక సంగీతంలో సిమంతిన కౌటాలకు అవార్డులు లభించాయి. అలాగే సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్న డాక్టర్ జననీ కృష్ణ, మానవీయరంగంలో సంకరరావ్, కమ్యూనిటీ సర్వీస్‌లో చివుకుల ఉపేంద్ర అవార్డులు అందుకున్నారు. స్వర్గీయ రఘునాథన్ స్మారక అవార్డు తరుమల రావుకు లభించింది.
అనంతరం గిరిజ కొల్లూరి, శ్రీ కష్ణ, శేషు ఆకుల ఆలపించిన గీతాలు అలరించాయి. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, చిరింజీవి హిట్‌సాంగ్స్‌కు పవన్ గేదెల చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. చివరిలో టిఎఫ్‌ఎఎస్ సునీత కనుమూరి వందన సమర్పణతో న్యూజెర్సీ దీపావళి సంబరాలు ముగిశాయి.
Courtesy: ఆంధ్ర జ్యోతి
0 Comments:
Post a Comment
<< Home