జాతీయ అధికారభాషగా తెలుగు తగదా?
- తుర్లపాటి కుటుంబరావు
ఆంధ్రప్రదేశ్ అవతరించి, ఇది 50వ సంవత్సరం. స్వర్ణో త్సవాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సందర్భం గా తెలుగు భాషకు సంబంధించిన ఒక ముఖ్య విషయాన్ని గురించి దేశంలోని తెలుగు మాట్లాడే వారందరు పరిశీలించవ లసివుంది. ఆ విషయాన్ని విస్మరించి, కేవలం స్వర్ణోత్సవాలను జరుపుకుంటే ప్రయోజనం లేదు. ఎన్నిచెప్పినా బెంగాలీలు, తమిళులకు ఉన్న స్వభాషాభిమానం తెలుగువారికి లేదన్నది నిష్ఠుర సత్యం. స్వభాష పట్ల వారిది వీరాభిమానం. రెండున్నర సంవత్సరాల క్రితం తమిళనాడులోని ద్రావిడ పార్టీల ఎం. పీ. లు తమ రాజకీయ విభేదాలను విస్మరించి, సమైక్యంగా అప్ప టి ప్రధాని వాజపేయిని కలుసుకుని, ప్రాంతీయ భాషలన్నిం టిలో తమిళం ప్రాచీనమైనదని, అందువల్ల దానికి ప్రాంతీయ భాషా ప్రతిపత్తిని భారత ప్రభుత్వం ఇవ్వాలని, అంతేకాక, తమిళ భాషకు జాతీయ స్థాయిలో 'ద్వితీయ అధికార భాషా ప్రతిపత్తి' ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ వార్తను పత్రికలలో చూచిన రోజు నేను ప్రధాని వాజపేయికి టెలిగ్రామ్ ఇస్తూ, భారతదేశంలో హిందీ తరువాత హెచ్చుమంది మాట్లాడే భాష తెలుగే అని, దేశవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల మంది తెలుగు మాట్లాడుతారని అందువల్ల తెలుగును హిందీ తరువాత భార తదేశానికి అధికార భాష చేయాలని పేర్కొన్నాను. అంతేకాక, అదే రోజు ఆయనకు సవివరంగా లేఖ రాస్తూ, తెలుగు భాషకు దాదాపు మూడు వేల సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉన్న దని, అందువల్ల 'ప్రాచీన భాషాప్రతిపత్తి'కి తెలుగు అర్హమైన దని స్పష్టం చేశాను. కాగా, ఇటీవలనే తమిళ భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరువు చేసింది: తెలుగు సంగతి అతీ గతీ లేదు! తమ భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తిని సాధించుకున్న తమిళ నాయకులు ఇప్పుడు దానికి కేంద్ర స్థాయిలో ద్వితీయ అధికార భాషా ప్రతిపత్తి కోసం ఆం దోళన చేస్తున్నారు! అప్పటిలో తెలుగుకు అధికార భాషా ప్రతి పత్తి కోసం నేను చేసిన ఆందోళన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలుగును ద్వితీయ అధికార భాష చేయాలని విజ్ఞ ప్తి చేశారని విషయమై పార్లమెంటులో ప్రశ్న రాగా, రాష్ట్ర ప్రభు త్వం విజ్ఞప్తి చేరిందని, ఆ ప్రతిపాదనపై ఏ నిర్ణయం తీసుకో లేదని కేంద్ర హోం శాఖ మంత్రి ప్రత్యుత్తరమిచ్చారు. ఇంతలో కేంద్రంలోను, రాష్ట్రంలోను ప్రభుత్వాలు మారాయి. మరి, ఇప్పుడు తమ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నిలిచి, నడుస్తు న్నదని చెప్పుకునే డిఎమ్‌కె నాయకులు తమ పలుకుబడితో తమిళ భాషకు తెలుగు కంటే ముందు- ప్రాచీన భాషా ప్రతి పత్తి విషయంలో వలె- అధికార భాషా ప్రతిపత్తి సాధించు కున్నా ఆశ్చర్యపడనక్కర లేదు!
భారతదేశానికి అధికార భాష అయ్యే అర్హత తెలుగుకు ఉం దని తెలుగులు మాత్రమే భావించడం లేదు. దేశ విదేశ ప్రము ఖులెందరో తెలుగు భాషా మాధుర్యం, ఉచ్ఛారణ సౌలభ్యం, కాలానుగుణంగా విస్తరించగల శక్తిని ప్రశంసించారు. ఎప్పుడో దాదాపు 600 సంవత్సరాల క్రితం-1420లో-భారతదేశం వచ్చి, వివిధ భాషలను పరిశీలించి, తెలుగు భాషా మాధుర్యా న్ని ఉచ్ఛారణ సౌలభ్యాన్ని చవిచూచి తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అని ప్రశంసించారు. ఆ తరువాత 16 వ శతాబ్దం లో విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీ కృష్ణ దేవరాయలు తెలుగును 'దేశ భాషలందు లెస్స' అన్నాడు. ఆయన మాతృ భాష తుళు. అలాగే తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి మన భాషను 'సుందర తెలుంగు' అంటూ అభివర్ణించారు. ఇక, పాశ్చాత్యులైన సిపి బ్రౌన్, బిషప్ కాల్డ్వెల్, జెపిఎల్ గ్విన్ వంటివారు తెలుగు భాషోన్నతికి చేసిన సేవ తెలుగు పండితు లే చేయలేదు. తెలుగు భాషకు అందరి కంటే అత్యున్నతమైన ప్రశంసను అందించింది-ప్రఖ్యాత బ్రిటిష్ జీవ శాస్త్రవేత్త ప్రొఫె సర్ జెబిఎస్ హాల్డేన్. ఆయన 1950-51 ప్రాంతంలో ఒరిస్సా లో ఒకచోట మాట్లాడుతూ శాస్త్రీయ, సాంకేతిక విషయాలను కూడా బోధించగల సౌలభ్యం, విస్తృతి తెలుగు భాషకు ఉన్నా యని, భారతదేశం మొత్తానికి అధికార భాష కాదగిన ఉత్తమ భాషా లక్షణాలన్నీ తెలుగుకు కలవని, అందువల్ల తెలుగును ఇండియాకే అధికార భాషగా చేసే విషయం పరిశీలించాలని పేర్కొన్నారు. ఇక సంఖ్యాధిక్యత రీత్యా చూస్తే ఒకప్పుడు భార తదేశంలో హిందీ మాట్లాడేవారి తరువాత హెచ్చుమంది మాట్లాడే భాష బెంగాలీ. అయితే 1947లో దేశ విభజన వల్ల తూర్పుబెంగాల్ (నేటి బంగ్లాదేశ్) పాకిస్థాన్‌లో ఉండిపోవడం వల్ల బెంగాలీ ద్వితీయ స్థానం తెలుగుకు సంక్రమించింది. అప్పటిలో హిందీ, బెంగాలీ భాషల తరువాత భారతదేశంలో తెలుగుదే తృతీయ స్థానమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమా వేశంలో ఆంధ్ర మేధావి డాక్టర్ పట్టాభి అణాకాసు సాక్షిగా నిరూపించాడు. కాగా ఇప్పుడు హిందీ తరువాత దేశంలో హెచ్చుమంది మాట్లాడే తెలుగువారు 15కోట్ల మందిలో సగం మంది ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండగా తమిళనాడులో 2.8 కోట్ల మంది (42 శాతం) ఉన్నారు. ఈ అంకెను ప్రధాని పదవీ విర మణాంతరం ఒకానొక సందర్భంలో పాములపర్తి వెంకట నర సింహారావే పేర్కొన్నారు. అలాగే కర్ణాటకలో 1.7 కోట్లు (33 శాతం) మహారాష్ట్రలో కోటిన్నర మంది (16 శాతం), ఒరిస్సా లో 80 లక్షల మంది (22 శాతం) ఇంకా కేరళ, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, హర్యానా, మధ్యప్రదేశ్, ఢిల్లీలలో మిగిలినవారు న్నారు. దీన్ని బట్టి తమిళ భాషను దేశ స్థాయిలో అధికార భాష చేయాలని కోరే తమిళనాడులోనే తెలుగు మాట్లాడేవారి సంఖ్య సగానికి కొంచెం తక్కువగా మాత్రమే ఉన్నారనే వాస్తవాన్ని విస్మరిస్తే ఎలా? అందుచేత అటు భాషా ప్రమాణాల రీత్యా కాని, ఇటు సంఖ్యాధిక్యత రీత్యాకాని ఇతర భాషావేత్తల అభి ప్రాయానుసారంకాని భారతదేశానికి హిందీ తరువాత రెండవ అధికార భాష కావడానికి తెలుగు అన్ని విధాల అర్హమైనదన డం నిర్వివాదం. అయితే, హిందీకి తెలుగు పోటీకాదు. రాజ్యాంగంలో నిర్దేశించబడిన రీతిగ హిందీ ప్రథమ అధికార భాషగానే ఉంటుంది. కాకపోతే, దక్షిణాది రాష్ట్రాలవారు కోరి నంత కాలం ఇంగ్లీషు అనుసంధాన భాషగా ఉంటుందని 1965లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పార్లమెంటు లో హామీ ఇచ్చారు. అలా ఇవ్వడం కూడా తమిళనాడులో కనీ వినీ ఎరుగని రీతిలో జరిగిన హిందీ వ్యతిరేక దౌర్జన్యోద్యమం వల్లనే! అయితే, ఇప్పుడు తెలుగు భాషపైనే ఇంగ్లీషు స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇంగ్లీషును వద్దనడం లేదుకాని, తెలుగు కన్నతల్లి అయితే, ఇంగ్లీషు కళ్ళజోడు వంటిది! అందు వల్ల తెలుగును భారతదేశానికి రెండవ అధికార భాష చేయా లన్న ఉద్యమం కూడా ఊపందుకోవాల్సిన సమయమిది. ఒక దేశానికి రెండు, మూడు అధికార భాషలు ఉండవచ్చు. దక్షిణా ఫ్రికాలో ఇంగ్లీషు, డచ్ భాషలు అధికార భాషలు; కెనడాలో ఇంగ్లీషు, ఫ్రెంచి అధికార భాషలు. ఇక స్విట్జర్లాండ్ విషయా నికి వస్తే అక్కడ మూడు భాషలు-ఇంగ్లీషు, ఫ్రెంచి, ఇటా లియన్ అధికార భాషలు.
కాగా తెలుగును కేంద్రంలో రెండవ అధికార భాష చేయ డానికి మనకు 'రాజకీయ సంకల్పం'కూడా ఉండాలి. ఆ రాజ కీయ సంకల్పం ఉండబట్టే, తమిళులు నిన్న తమ భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి సాధించుకుని, రేపు అధికార భాషా ప్రతిపత్తిని సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు! కాగా లోగ డ కేంద్రంలో ఒక రాజకీయ పక్షం, రాష్ట్రంలో వేరొక రాజకీయ పక్షం అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలోను, కేంద్రం లోను ఒకే పార్టీ అధికారంలో ఉంది. ఇది తెలుగు భాషకు అదృష్ట సమయం. రాష్ట్రంలోని ఎంపీల బలం కేంద్రానికి స్థిర త్వం. అందులోను ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిది భల్లూకపు పట్టు. ఆయన తలచుకుంటే- ప్రాజెక్టుల విషయంలో వలెనే- తెలుగు భాషకు జాతీయ స్థాయిలో అధికార భాషా ప్రతిపత్తిని సాధించి, ఈ కర్తవ్య నిర్వహణలో కూడా 'అపర భగీరథు' డని పించుకోవాలి. తెలుగు భాషాచరిత్రలో ఆయన పేరు శాశ్వ తంగా నిలిచిపోతుంది! ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవ సంవత్సరం ఇందుకు మంచి సమయం! అప్పుడే సమైక్యాంధ్రప్రదేశ్ స్వర్ణో త్సవాలకు మరింత సార్థకత!
Courtesy: ఆంధ్ర జ్యోతి
Keywords: Telugu , Sri Thurlapati Kutumba Rao , second national offical language , India , Andhra Jyothi , November 2005
1 Comments:
christian louboutin outlet
pandora outlet
cheap ray ban sunglasses
ugg outlet
nike factory store
coach outlet
nfl jerseys wholesale
coach outlet
pandora jewelry
kate spade outlet
Post a Comment
<< Home