''కాశీకి వెళ్లాను రామాహరీ...''
- చల్లా భాగ్యలక్ష్మ
''కాశీకి వెళ్లాను రామాహరీ...'' అని ఆ మధ్య కవిగారు రాయకమునుపే తెలుగులో యాత్రా చరిత్రలు పుట్టుకొచ్చాయి. సాహిత్యంలో తమకూ చోటుందని చాటుకోడానికి పోటీ పడ్డాయి. పురాణ ఇతిహాసాల్లోనే యాత్రల ప్రస్తావన ఉన్నా యాత్రా చరిత్రలు రూపుదాల్చింది మాత్రం పందొమ్మిదో శతాబ్దం ప్రథమార్ధంలోనే. అందులోనూ ఏనుగుల వీరాస్వామయ్య రాసిన కాశీయాత్ర చరిత్రే తొలి యాత్రా చరిత్ర అని పలువురు ఆమోదముద్ర వేశారు. అంతకు మునుపే అంటే కాశీయాత్ర చరిత్ర వెలువడటానికి ఎనిమిదేళ్ల క్రితమే వెన్నెలకంటి సుబ్బారావు ఓ 'కాశీయాత్ర' రాశారు. అయితే అది ఆంగ్లంలో ఉండి తర్వాత కాలంలో తెలుగులోకి అనువదించబడింది. అందుకే తొలి యాత్రాచరిత్రగా అస్తిత్వాన్ని నిలుపుకోలేకపోయింది. ఏది ఏమైనా తెలుగులో యాత్రా చరిత్రలు కాశీయాత్రలతోనే ప్రారంభమయ్యాయనడం నగ్నసత్యం.
'యాత్రా చరిత్ర' అన్నది వచన ''వాఞ్మయ వికాసానికి తోడ్పడిన తొలినాటి వచన ప్రక్రియల్లో భాగమని'' సాహిత్య చరిత్రలు రాసిన వారి అభిప్రాయం. ఇలాంటి రచనలనిండా అనుభవాలు, అనుభూతులు, ప్రతిస్పందనలే కొలువై ఉంటాయి. అవి తర్వాతి తరాల వారికి అనుభవాల మూటలను చేరవేస్తాయి.
''సైర్‌కర్ దునియా కి గాఫిల్ జిందగానీ
ఫిర్ కహాజిందగీ అగర్ కుఛ్ రహీతో నౌజవానీ
ఫిర్ కహా?''దాని అర్థం ''ఓ మూర్ఖుడా! జీవితం దుర్లభం కాబట్టి ప్రపంచ పర్యటన చేయి. ఈ జీవితం ఇక వుండదు. ఒకవేళ కొంత మిగిలినా మళ్లీ యవ్వనం దుర్లభం'' అని. ఈ విషయాన్ని తనకు పదేళ్ల వయస్సున్నప్పుడు చదివిన 'విస్తృతయాత్రికుడు' రాహుల్ సాంకృత్యాన్ జీవితకాలంలో మర్చిపోలేదు. అందుకే ఆయనలో ఎన్నో జ్ఞాపకాల దొంతరలు పేరుకుపోగలిగాయి.
అల్లసాని పెద్దనార్యుడు కూడా మను చరిత్రలో ఒకచోట పుణ్య తీర్థాల సందర్శన ప్రాముఖ్యాన్ని
''పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ
మహిమ వినుటయు నఖిల కల్మష హరంబు...'' అని ఉద్ఘాటించారు. శ్రీనాథుడు చూడని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. ఇలా పండితులంతా దేశపర్యటన చేసినా కాశీయాత్రలతోనే వాటికంటూ ప్రత్యేకరూపం ఏర్పడింది. తొలి తెలుగు యాత్రాచరిత్రలో రచయిత జీవిత విశేషాలు, వ్యక్తిత్వం, ఆయన ప్రయాణించిన దూరం, అక్కడ ఎదురైన ఇబ్బందులు, అప్పటి వరకు ఎరుగని ప్రజల ఆకార విశేషాలు, వేషధారణ, ఆహారపుటలవాట్లు, వాళ్లు ధరించిన నగలు, ఇండ్లు నిర్మించుకున్న తీరు, ఆచార వ్యవహారాలు, భౌగోళిక పరిస్థితులు, పాలనా విశేషాలు, అక్కడ లభించే పండ్లు, వాళ్లు చేసుకునే పండుగలు... అంటూ మొత్తం వివరించారు.
అయోధ్యా, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికా, పూరీ ద్వారావతీచైవస్త్తెత మోక్ష దాయికాః'' అన్న శ్లోకంలో కాశీకి వెళ్లిన వారికి మోక్షం సిద్ధిస్తుందని ఉంది. అందుకే వీరాస్వామయ్య గారు కాశీని చూడటానికి వెళ్లుంటారని ఛలోక్తులు విసిరిన వారూ లేకపోలేదు. ఆయన్ని అనుసరించి మద్రాసు నుంచి కాశీకి వెళ్లిన వ్యక్తి వెన్నెలకంటి సుబ్బారావు. ఆయన కాశీయాత్రలో కూడా బోలెడు విషయాలు తెలుస్తాయి. 'నానారాజ సందర్శనం' చేసిన తిరుపతి వేంకట కవుల్లో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికీ కాశీ మీద మమకారం ఉండేది. కాశీ విశేషాలు తమ గురువుగారి నోటెంట వినీ వినీ కోరికను పెంచుకున్నారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి పెళ్లయిన నెల రోజులకే కాశీయాత్రకు బయలుదేరారు. ''నేననుకొన్నంత కాలమూ కాశీలో నున్నను భార్యా ప్రతిబంధమ్‌మిన్నీ వుండదని వూహించుకొన్నాను'' అని కాశీయాత్రలో రాసుకున్నారాయన. నిజానికి కాశీకి వెళ్లినప్పుడు ఆయన యాత్రా వృత్తాంతం రాయలేదట. 64ఏళ్ల వయస్సులో రాశారట. అప్పుడు రాస్తేనే అది ''ఇహపర సాధకంగా'' ఉంటుందని'' ఒకానొక సందర్భంలో ప్రస్తావించారు కూడా. కాశీ మీద భక్తితో, అక్కడికి వెళ్లి యాత్రా రచనలు చేసినవారు కొందరయితే అక్కడే ఉండి చదువుకుని పరిసరాల ప్రభావానికి లోనై ఆ సౌందర్యాన్ని వర్ణించినవారూ అరుదుగా కనిపిస్తున్నారు. వారిలోనే కృష్ణా జిల్లా కాకరపర్రు గ్రామనివాసి పరబ్రహ్మశాస్త్రి ఒకరు. 'సకల యాత్రా జనోపయోగార్థము' 'కాశీ యాత్ర' రచన సాగిస్తున్నానని పీఠికలో చెప్పుకున్నారాయన. ''కాశీగయా ప్రయాగ క్షేత్రాల్లోని సంప్రదాయ విశేషాలను చాటి చెబుతున్న ఉత్తమ గ్రంథం ఇది'' అని పండితుల ఉవాచ. సులభ గ్రాంధికంలో కొంత వ్యవహారికంలో ఎలాగైతేనేం వచన రూపంలో వచ్చిన కాశీ యాత్రల పరంపరను ఆదిభట్ల 'కాశీ శతకమ్' పేరుతో కొత్త బాటలో నడిపించారు. ఆదిభట్ల నారాయణదాసు చేసిన కాశీయాత్రా విశేషాలను సంస్కృత శ్లోకాల్లో చక్కటి శతకంలా రచించారు. ఇందులో వంద శ్లోకాలున్నాయి.
ఆ తర్వాత రామసుబ్బారాయుడి కాశీయాత్ర, కమలాదేవి కాశీయాత్ర అని కాశీ విశేషాల గురించి పలువురు గ్రంథస్తం చేశారు.
ఈ యాత్రా చరిత్రల ద్వారా అప్పటి సంపద, భాషా విశేషాలు, నాణేలు, క్రయ విక్రయాలు, ఉత్సవాలు వంటివెన్నో బోధపడతాయి. తెలుగులో నీలగిరి యాత్రలు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ భారతదేశ యాత్రలు విదేశాలకు సంబంధించిన పర్యటనలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు ముద్రించబడ్డాయి. తెలుగు సాహిత్యంలో యాత్రలకు సంబంధించిన పుస్తకాల గురించి తొలిసారి అధ్యయనం చేసిన వ్యక్తి మచ్చ హరిదాసు 'తెలుగులో యాత్రా చరిత్రలు' అనే అంశంపై సిద్ధాంత వ్యాసం సమర్పించి డాక్టరేట్ పొందారు. ''16 అధ్యాయాలుగా విస్తరిల్లిన ఈ బృహత్ సిద్ధాంత వ్యాసం ఒక యాత్రా విజ్ఞానసర్వస్వం వంటిది'' అని డాక్టర్ ఎన్.గోపి ఈ వ్యాసాన్ని వేనోళ్ళ పొగడటం విశేషం. కాశీకి వెళ్ళలేని వారికి ఈ కాశీయాత్ర చరిత్రలు ఆధ్యాత్మిక సంపదను చేకూరుస్తున్నాయి. అంటే అతిశయోక్తి కాదేమో.
Courtesy: ఈనాడు
Keywords : Telugu , Andhra , literature , kasi kaasi yatra charitra , Challa Bhagyalakshmi , Eenadu , November 2005 , Vennelakanti Subba Rao , O Kasi Yatra
2 Comments:
delete above two comments. they are in Chinese language - advertisements for pornographic sites. get them translated by google transalator
fear of god
chrome hearts
off white clothing
air jordan
palm angels
nike off white
kyrie 7
supreme
supreme clothing
goyard tote bag
Post a Comment
<< Home