అమెరికాలో వెంకన్న గుడి
తిరుపతి, అక్టోబర్ 27(ఆన్‌లైన్): అమెరికాలోని డెట్రాయిట్‌లో తిరుమల తరహా ఆలయ నిర్మా ణానికి అక్కడి తెలుగువారు శ్రీకారం చుడుతు న్నారు. నవంబర్ 4న తొలిదశ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది. ఈ ఆలయ నిర్మాణానికి రూ. 200 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి శంకుస్థాపన చేస్తారు. అమెరికాలో కొన్ని హిందూ ఆలయాలు ఉన్నప్పటికీ పూర్తిగా తెలుగువారే పూనుకుని ఈ ఆలయాన్ని నిర్మిస్తు న్నారు. డెట్రాయిట్ సమీపంలోని నోవీ సిటీలో 11 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ సముదాయం నిర్మాణమవుతుంది. తిరుమల ఆలయ నిర్మాణ శైలిలోనే డెట్రాయిట్ వేంకటేశ్వరాలయం నిర్మా ణం జరుగుతుంది. మూడు దశలలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది.
ొలి దశలో పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం పనులు జరుగుతాయి. రెండవ దశలో గోపురం నిర్మిస్తారు. మూడవ దశలో కమ్యూనిటీ హాలు నిర్మిస్తారు. అమెరికాలోని తెలుగువారికి సాంస్కృతిక కేం ద్రంగా డెట్రాయిట్ ఆలయాన్ని రూపొందిస్తారు. దక్షిణ మిచిగాన్ రాష్ట్రంలోని యువతరానికి తెలు గు భాష, సంస్కృతి అధ్యయనం చేయడానికి, ఆచరించడానికి ఇదో వేదికగా ఉపయోగపడుతుం ది. ఈ సముదాయంలో తెలుగు సాహిత్యం, చరి త్ర, సంస్కృతికి సంబంధించిన పుస్త కాలతో ఒక లైబ్రరీ ఏర్పాటుచేస్తారు. తెలుగు ప్రజల శుభ కార్యాలకు కూడా దీన్ని వినియోగించుకుంటారు.
ఆలయ ట్రస్టీగా కృష్ణప్రసాద్ కాట్రగడ్డ వ్యవహ రిస్తున్నారు. తానా అధ్యక్షుడు బండ్ల హనుమయ్య కో-ఆర్డినేటర్‌గాను, చలపతి కోడూరు భవన నిర్మాణ కమిటీ చైర్మన్‌గాను వ్యవహరిస్తున్నారు. ఈనెల 4న జరగనున్న శంకుస్థాపన కార్యక్రమా నికి తిరుపతి నుంచి శంకు చక్రాలు, నామాలు గల శిలాఫలకాన్ని తీసుకువెళుతున్నారు. తిరుపతి నుంచి తీసుకువెళ్ళే ఒక ఇటుకను కూడా ఈ ఆలయ నిర్మాణంలో వినియోగిస్తారు. డెట్రాయిట్ వేంకటేశ్వరాలయానికి అవసరమైన మూలవిగ్రహాలను తిరుమల తిరుపతి దేవస్థానం బహూకరిస్తుంది.
శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనే వెయ్యి మందికి బహూకరించేందుకు తిరుమల నుంచి శ్రీవారి ప్రసాదాలు, కంకణాలు, పసుపు దారాలు, గోవింద నామాలు, క్యాలెండర్లు, సిల్వర్ డాలర్లు, వెయ్యి చిన్న లడ్డూలు తీసుకువెళుతున్నారు. భూమి పూజకు అవసరమైన అష్టలక్ష్మిల వెండి కలశాన్ని తిరుమల ఆలయంలో దేవుని ముం దుంచి డెట్రాయిట్‌కి పంపుతున్నారు. మధురై నుంచి భూమిపూజ యంత్రాలను పారుపత్తేదారు శేషాద్రి తెప్పించి తిరుమలలో పూజచేసి పంపుతు న్నారు. శంకుస్థాపన మహోత్సవం రోజున డెట్రా యిట్‌లో తిరుమల బ్రహ్మోత్సవాల సిడిని, గత ఏడాది జరిగిన తిరుపతి ఉత్సవాల సిడిని ప్రద ర్శిస్తారు.
Courtesy: ఆంధ్ర జ్యోతి
America USA Tirupati Tirumala Lord God Venkateshwara Hindu Hinduism temple 200 crores Detroit
0 Comments:
Post a Comment
<< Home