శ్రీ సిద్దప్ప వరకవి [1903-1984]
సాహిత్యచరిత్ర గుర్తించని సిద్దప్ప వరకవి!
-బి.వి.ఎన్.స్వామి
భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పడింది కాని సమగ్ర సాహిత్య సాంస్కృతిక భాషా చరిత్ర ఏర్పడలేదు. ప్రధాన స్రవంతి చరిత్ర మరింత విస్తరించింది. విలువైన ఎన్నో విలక్షణ పాయలు పక్కకు నెట్టబడ్డాయి. ఈ కోణంలో కొరవడిన ప్రజాస్వామిక దృక్పథం వల్ల ఎంతోమంది కవలు,రచయితలు ఎజెండాపైకి రాలేక పోయారు. అలాంటివారిలో సిద్దప్ప వరకవి ఒకరు.
అతను కళ్ళు తెరిచేనాటకి హదరాబాదు సంస్థానంలో ప్రజల స్థితిగతి ఒడిదొడుకులతో కూరుకుపోయింది. అతడు యవ్వనదశలోకి వచ్చేనాటికి ఆంధ్రజన కేంద్ర సంఘం (1921) ఏర్పడింది. మొత్తం సంస్థానంలో ప్రజలు పాలకుల మధ్య అంతరాయం ఏర్పడింది. మరోవైపు సామాజికంగా కరడుగట్టిన విశ్వాసాలు, సాంఘిక కట్టు బాట్లు ఊపిరి సలపనివ్వలేదు. ప్రధాన వనరులైన భూమి, రాజ్యాధికారంకోసం సాయుధపోరు, రాజకీయపోరు ఉధృతమయ్యాయి. తెలంగాణమంతా ఒక కాన్సంట్రేషన్ క్యాంప్‌లా మారింది. అటువంటి ఉక్కపోత వాతా వరణంలో మానవ స్వభావసిద్ధమైన ప్రశాంతతకోసం, అర్థరహిత ఆంక్షలను తెంచడం కోసం రాజకీయ స్పృహ కు అతీతంగా, అనుభవజ్ఞానమే చోదకశక్తిగా ప్రజల్లో వెలుతురు నింపడం కోసం బయల్దేరినవారు తత్త్వకవులు. వీరు పెద్దగా చదువుకున్నవారు కాదు. నాటి నిజాంకాలంలో చదవడం, రాయడం నేర్చినవారు చాలా అరుదు. మాతృభాషలో విద్యాలయాలు కరువు. ఉర్దూమీడియం పాఠశాలలు కూడా అందుబాటులో లేవు. నైజాం క్రూర పాలనలో చదువుకొనే వాతావరణం లేదు. పల్లెటూళ్ళలో వయోవృద్ధులైన వారిచే వినవచ్చే శృతపాండిత్యం, ధార్మిక తాత్విక చర్చలు తప్ప నియత విద్యావిధానం లేదు. పట్టణాల్లో సైతం దళిత, బహుజనులైన పేదవారికి చదువు అందని ద్రాక్షయింది. మొత్తానికి తెలంగాణ నిరక్షరాస్యత కోరల్లో చిక్కిశల్యమైపోయిన కాలం అది. అటు వంటి కాలంలో సంఘసంస్కరణాభిలాష ఊపిరిగా, ధిక్కారమే ప్రాణంగా, ప్రజాసౌఖ్యమే పరమావధిగా, శృతపాండిత్యమే ప్రతిభగా సాహిత్య సృష్టి చేసినవారు తత్త్వకవులు. ఈ కవులు ప్రజలలో ఒకరిగా శ్రమజీవ వర్గాలలోంచి వచ్చారు. ప్రజల నాలుకలపై వారి పద్యాలు, ప్రజల హృదయాలలో వారి ప్రతిమలు నిలిచి పోయాయి. మహ్మదీయ పాలనా ప్రభావం, వారి సంపర్కం తెలుగునేలలో నలుదిక్కులా ప్రసరించినట్లే వీరి ఆలోచనల్లోనూ చోటుచేసుకుంది. సూఫీ బోధనలు ఈ తాత్వికకవులను ఆకట్టుకున్నాయి. ఆ వెలుగులో ప్రజల కోసం కవిత్వం అల్లారు. అటువంటి తత్త్వకవుల్లో సిద్దప్ప వరకవి ఒకరు.
సిద్దప్ప వరకవి (జననం: 1903, మరణం: 1984) కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని గుండారెడ్డి పల్లెకు చెందినవారు. చేస్తున్న వృత్తులవల్ల ఏర్పడ్డకులాలు, వర్ణసమాజ నిబంధనలవల్ల నెత్తిమీద కుంపటులైన వేళ, ఆ బరువును దింపడానికి తత్వకవులు కులప్రాధాన్యతను తగ్గించారు. ఆంగ్లో వెర్నాక్యులర్ చదువులు తెలియని తెలంగాణ ప్రజలకు తత్వకవుల బోధలుప్రశాంతతను ప్రసాదించాయి. పీలకలయిన నిమ్న, అట్టడుగు వర్గాల వారి జీవితాలకు తమ బోధల ద్వారా జీవాన్ని ప్రసాదించినవాడు సిద్దప్ప వరకవి. వెనుకబడిన కుమ్మరి కులానికి చెందిన వీరు ఏడవ తరగతి వరకూ చదివారు. ఉన్నది ఉర్దూమీడియం కనుక తెలుగుకు దగ్గరకాలేకపోయారు. ఆ విషయాన్నే వీరు ఈ విధంగా చెప్పుకున్నారు.
'పాఠశాలయు సర్కారి పనులు గనుచు
పదియునైదవ యీడున భావమలర
జ్ఞానులను గూడి సకలంబు గాంచి చూచి
వాణి కృపచేత రచియిస్తి వర కవిత్వము'.
సీస,గీత, కంద పద్యాలలో వీరి సృజనసాగింది. జానపద బాణీలకు, గేయాలకు తెలంగాణ పుట్టిల్లు. సిద్దప్ప వరకవి పల్లెలో పుట్టి, పల్లెలో పెరిగి వృత్తిని నమ్ముకున్న శ్రామికుడు. కనుకనే ఇతనికి జానపదశైలి ఒంటబట్టింది. అచ్చుయంత్రాలు వచ్చాక లిఖితసాహిత్యానికి మహర్దశపట్టింది. ఆ మహర్దశ నోటిసాహిత్యాన్ని మింగి జీర్ణం చేసు కుంది. పత్రికలు, అచ్చుయంత్రాలు పట్టణప్రాంత, అభివృద్ధి చెందిన ప్రాంతీయుల చేతుల్లో ఎక్కువగా ఉండడం వల్ల వెనక బడ్డ ప్రాంతకవులకు, వారి సాహిత్యానికి ఆదరణ కరువైంది. సిద్దప్ప వరకవి వెనుకబడిన కులానికీ, తెలంగాణ ప్రాంతానికీ చెందినవాడు. కనుక ఇతని సాహిత్యకృషి ప్రధానస్రవంతి సాహితీచరిత్రలో నమోదు కాలేదు. కాని ప్రజల నోళ్ళలో వీరి పద్యాలు నానాయి. వీధిబళ్ళలో పాఠ్యాంశాలుగా మారాయి. తన పాండితీ ప్రకర్షకు ప్రతిబింబంగా ఇతను ఎటువంటి 'కంచుఢక్క'లను నెలకొల్పలేదు. తన సాహిత్యఠీవికి నిదర్శనంగా మీసాలు దువ్వలేదు. 'చదువులేదిక నాంధ్ర సంగ్రహంబుల లెస్స, కనిచూడలేదప్ప కావ్యమైన... నోట బల్కియు చేత నొనరంగ వ్రాసితి చెలువొంద మీ పాదసేవకుడను' అని వినమ్రంగా తెలిపాడు. వాణివరంచే కవిత్వానికి చేరువై పద్యం రాయగలిగానని, అందుకే తాను వరకవినని తెలుపుకున్నాడు. 'గొప్పవాడనను గాను, కోవిదు డనుగాను తప్పులున్నను దిద్దుడీ తండ్రులార' అని విశదపరిచాడు. చాలామంది తాత్వికుల్లాగానే సిద్దప్పకూడా వైరాగ్యాన్ని బోధించారు. ప్రజలు ఈ బోధనలను కళ్ళకద్దుకున్నారు.
'నిజాం రాష్ట్రంలో ఆంధ్రకవులు పూజ్యము' అని గోలకొండ పత్రిక తొమ్మిదవ సంవత్సరాది సంచికలో ఆధునిక భావకవిత్వ తత్వము అను శీర్షికగల వ్యాసమునందు శ్రీ ముడుంబై వేంకటాచార్యులు అన్నారు. అందుకు స్పందించి సురవరం ప్రతాపరెడ్డిగారు 'గోలకొండ కవుల సంచిక' వెలువరించినారు. ఇందులో సిద్దప్ప వరకవి పద్యాలు రెండున్నాయి. ఈ రెండు పద్యాల్లో ఒకటైన 'ఘటము కంటెను వేరైన మఠము లేదు, ఆత్మకంటెను వేరైన హరియు లేడు' అనే చరణాలు ప్రసిద్ధిపొందాయి. తెలంగాణ సాంస్కృతిక చిహ్నం 'బతుకమ్మ పండుగ'. ఈ పండుగ రీతుల గురించి తెలుపుతూ 'వైనమను సిబ్బులన్ నదులు బదులందుకొని, యెవ్వరెవ్వరి చద్ది వారు గుడి చి' అంటూ పండుగ విశేషాలు తెలిపాడు. 'సిబ్బి' అనేది తెలంగాణలోని అత్యంత రమణీయమైన పదం. పద్యాలలో తెలంగాణ పదాలను ఆకర్షణీ యంగా పొదిగాడు. దాదాపు 25 పుస్తకాలను వెలువరించిన సిద్దప్ప వరకవి
'మట్టి ఒకటె కుండలు వేరు
బంగార మొక్కటె సొమ్ములు వేరు
ఇనుము ఒక్కటె పనిముట్లు
ఆయుధాలు వేరు'
అని చెప్పగలిగిన శాస్త్రీయ, శ్రామిక దృక్పథం కలిగినవారు.
'పుట్టుగొడ్డుకు పిల్లపుట్టు బాధేమెరుక
పదిమందిని గన్న పడతికెరుక
అయ్యవార్లకు అడవి అంత్యంబులేమెరుక
చెలగి దిరిగెడు రామచిలుక కెరుక'.
ఇటువంటి ఆణిముత్యాలు అనేకం ఈయన సాహిత్యంలో కనబడుతాయి. లోకసారాన్ని వస్త్ర గాలం బట్టి తన పద్యాల్లో కూర్చినాడు. అందుకే వాటికా పఠనీయత వచ్చింది. అలతి,అలతి పదాలతో కవిత అల్లడం వల్ల నాలుకలపై ఇతని పద్యాలు నాని మిగిలాయి. ఎంచుకున్న మార్గం పట్ల స్పష్టత కలిగి ఆ వైపుగా ఇతన ఆచరణ సాగింది. తను వెళ్తున్నదారిలో వెళ్లిన మహనీయులను గుర్తించి వారి ఉనికిని పునాదిగా చేసికొని సహజమైన పల్లీయ సంబం ధాలను నెరపుకొని ఇలా చెప్పుకున్నాడు. వేమన్నను తాతగా, వీర బ్రహ్మాన్ని తండ్రిగా, ఈశ్వరమ్మను అక్కగా, దూదేకుల సిద్దడు అన్నగా, కాళిదాస అమరసింహులు ఆత్మబంధువులుగా వీరంతా చచ్చిననూ బ్రతికినవారనీ, తానీ త్రోవలో సాగిపోతున్నాననీ స్పష్టపరిచాడు. సాంప్రదాయిక భావాలను బద్దలుకొట్టడంలో, పునర్ని ర్వచించడంలో ఇతడు చాలామంది చదువుకున్న కవులను మించిపోయాడు.
'మోహమున నిండియున్న ముత్తయిదు వదియే
మోహమిడిచనదే ముండ మూర్ఖులారా
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనక మప్ప'
సిద్దప్ప వరకవివి ఊపిరాడనివ్వని ఊహలు. మకుటంతో శతకశైలిని పాటించినా ఏ పుస్తకాన్నీ 'శతకం'గా వెలువరించలేదు.
సీ॥ 'అజ్ఞానియే శూద్రుడవనిలో నెవడైన
సుజ్ఞానుడే యాత్మ సుజనుడతడు
వేదంబు జదివినా విప్రుడా విహితుండు
బ్రహ్మమెరిగిన వాడె బ్రాహ్మణుండు
వర్తకంబును జేయు వణిజుండు వైశ్యుండు
అవని పాలించిన నరుడె ప్రభువు
సకల నిందలు నోర్చు సదయిడు నరుడౌను
మత భేద మిడిచిన యతివరుండు'
గీ॥ జన్మచేతను వీరింక కలియుగమున
పేరుగాంచిన యెవరెవరి బేర్మి పనులు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనక మప్ప'
అంటూ చాతుర్వర్ణ్య లక్షణాలను పునర్నిర్వచించి, భావజాలపరంగా సమతను సాధించాడు. చాలా పద్యాలలో ఆర్తి, వేదన, సంఘరీతిపట్ల కసి, అసమానతలపట్ల అసహ్యం కనపడుతుంటాయి. ఇతని పద్యాలలో వేమన, జాషువా లాంటి కవుల జాడలు కనపడుతాయి. ఉదాహరణకు.... 'పేదలకన్నంబు పెట్ట ధైర్యము లేదు/ గట్టురాళ్ళకు తిండి బెట్టెదవు' లాంటి చరణాలలో శిలలని పూజించి పేదల ఆకలిని విస్మరించడాన్ని ఎత్తిచూపాడు. స్పష్టంగా అన్నార్తులవైపు గళాన్ని నిలిపాడు. సంసారాన్ని వదలకుండా, వృత్తిని అవలంబిస్తూ, సామాజిక అశాంతిని ప్రశ్నిస్తూ కారణాలను అన్వేషిస్తూ జీవనం సాగించారు. అందువల్ల వృత్తికారులు, శ్రమజీవులు వీరిపట్ల ఆకర్షితులయ్యారు. వీరందరూ ఏకం కావటానికి తత్వకవుల భక్తిమార్గం తోడ్పడింది.
సీ॥ ఏ కులంబని నన్ను ఎరుకతో నడిగేరు
నా కులంబును జెప్ప నాకు సిగ్గు
తండ్రి బొందిలివాడు తల్లి దాసరి వనిత
మా తాత మాలోడు మరియు వినుడి
మా యత్త మాదిగది మామ యెరుకలివాడు
మా బావ బల్జతడు మానవతుడు
కాపువారీ పడుచుకాంత దొమ్మరివేశ్య
భార్యగావలె నాకు ప్రాణకాంత'- ఈ విధంగా కులవాదాన్ని నిరసిస్తాడు. సమస్తకులాలవిరాట్ స్వరూపంగా కనిపిస్తాడు.
తన కాలం కన్నా తాను ముందుండి, తన వారల మధ్య తానుండి, అందర్నీ సంఘటిత పరచి శ్రామికవర్గ కళ్యాణానికి తనవంతు తోడ్పడ్డాడు. భక్తిమార్గంలో ఉంటూనే మూఢభక్తిని నిరసించాడు. జ్ఞానమార్గంలో పయ నిస్తూ కొత్త దారులు చూపాడు. ఛందస్సును పుక్కిటపట్టుకున్నా వ్యాకరణాన్నీ తోసివేయలేదు. పామరరంజకమైన కవిత్వాన్ని రాశారు. పాతికవరకు రాసిన వీరి రచనల్లో 'జ్ఞానబోధిని' నాలుగు సంపుటాలు ప్రసిద్ధిగాంచాయి. 'కాకి హంసోపాఖ్యానము', 'బిక్కనవోలు కందార్థాలు', 'గోవ్యాఘ్ర సంభాషణలు' మొదలగు కావ్యాలు వీరి ప్రతి భకు నిదర్శనాలు. మరణం తర్వాత ప్రజలు వీరి విగ్రహ ప్రతిష్ట జరిపారు. ఇప్పటికీ ప్రతి కార్తీకపున్నమి రోజు నలుమూలలనుండి వచ్చిన వీరి శిష్యులు, విగ్రహం సాక్షిగా గురుపూజోత్సవాన్ని జరుపుతారు. మరణం తర్వాత కూడా బతికున్న సిద్దప్ప వరకవి తెలంగాణలో అత్యంత ప్రసిద్ధిచెందిన తత్వకవి. సాహితీ చరిత్రలో వీరికి సము చిత స్థానం కల్పించాలి. చరిత్రగర్భంలో మరుగున పడి ఉన్న అనేక జీవ శిలాజాలను తెలంగాణ తవ్వుకుం టున్నది. ఆ సందర్భంగా మొదట పేర్కొనదగిన ఆణిముత్యం సిద్దప్ప వరకవి. వరకవి పద్యాలలో తెలుగుప్రజల తాత్వికత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తెలంగాణ తన చరిత్రను దర్శించుకుంటున్నది. అందులో భాగంగా సిద్దప్పవరకవిని స్మరించుకునే ప్రయత్నం ఇది.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Keywords: Siddappa Varakavi , Telangana , poetry , poet , Telugu , literature , poem , Andhra , thathva kavitvamu , article

17 Comments:
Some how I got into this blog, and while browsing down, i started reading and it was so good, I read it fully while thnking in my mind for the efforts you employed to get this information... And at the end you said that it was from Andhra Jyoti, and why and why people do not go inside and research on their own and get some new information? And I started sending this piece of info about Sri Siddappa Kavi to few of my Telengana Friends. They should know thier value and culture instead of betting their future at the feet of Italina lady Sonia Gandhi.
Thanks for the article.
This is sridhar reddy kaduthala from gundareddypalli. From childhood I just heard some thing about sri siddappa kavi, but because of this blog, I came to know the true value of him. Thank you.
ray ban outlet
gucci handbags
hollister kids
louis vuitton outlet online
michael kors outlet
michael kors handbags
oakley sunglasses
polo ralph lauren
coach outlet online
michael kors handbags
true religion outlet
ugg outlet
coach outlet online
louis vuitton outlet stores
celine handbags
ugg clearance
ugg boots
louis vuitton outlet
jordan retro
coach outlet store online
coach outlet store online
uggs outlet
louis vuitton handbags
lebron 12
north face jacket
louis vuitton outlet
tiffany and co
prada uk
jordan concords
oakley sunglasses wholesale
air jordan retro
hollister kids
jordans
ugg outlet
prada outlet
michael kors
abercrombie
north face outlet
20151223yuanyuan
reebok shoes
versace jeans
supra sneakers
ugg outlet
christian louboutin shoes
omega watches sale
michael kors outlet
gucci sito ufficiale
ugg boots
nike factory outlet
nike trainers
philadelphia eagles jerseys
bengals jersey
ray ban sunglasses outlet
nike outlet
nike outlet
coach outlet
cheap basketball shoes
clippers jersey for sale
michael kors handbags
christian louboutin outlet
pandora outlet
cheap ray ban sunglasses
ugg outlet
nike factory store
coach outlet
nfl jerseys wholesale
coach outlet
pandora jewelry
kate spade outlet
jeje0608longchamp outlet
christian louboutin
canada goose outlet
nike shoes
jordan shoes
cheap oakley sunglasses
moncler online shop
coach factory outlet
cheap ray bans
nike sale
nike blazer low
canada goose outlet
true religion jeans
fitflops sale
Hai, it's been a long objective of my mother to get a copy of Siddappa seesa padhya samputi (satakam). I have been searching at many book stalls and on Google, but in vain. If some body help me to get it, it's a great help n my mother would be so much happy. Ram, Chartered Accountant.7306622444
Sir, this is Ram from khammam. Could u help me to get a copy of Siddappa satakam.
Siddappa varakavi poems.wonderful.I have studied during 1955.But I have not found his books any where. Now I found a few poems in this blog.
మన తెలంగాణ లో వున్న గొప్ప తత్వ కవిని పరిచయం చేశారు .ధన్య్యవాదాలు.
Hi this is PRABHU CHARY from KANAKAMAMID,RANGA REDDY DIST, can you please share all POEMS to i am searching from long time please send to my email id :prabhuchary.vadla@gmail.com
Siddhappa padhyalu pdf file Baku kaavali
Naaku
I want This writer book
I want This writer book
Mobile Prices Bangladesh
Want book 9000296471
Post a Comment
<< Home