మొక్కజొన్న తోటలో
సుక్కలన్ని కొండమీద సోకుజేసుకొనేవేళ
పంటబోదె వరిమడితో పకపక నవ్వేవేళ
సల్లగాలి తోట కంత సక్కలగిలి పెట్టేవేళ
మొక్కజొన్నతోటలో, ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో, మరవకు మామయ్య!
చీకటి మిణుగురుజోతుల చిటిలిచిల్లులడకమునే
సుద్దులరాగాలు చెవుల నిద్దురతీయకమునుపే
ఆకాశపుటొడిని తోట ఆవలింతగొనకమునే
పొద్దువాలుగంటనే, పుంతదారివెంటనే
సద్దుమణగనిచ్చి రా, ముద్దులమామయ్య!
గొడ్డుగోద మళ్ళేసే, కుఱ్ఱకుంకలకుగానీ
కలుపుతీతలయి మళ్ళే కన్నెపడుచులకుగానీ
బుగ్గమీస మొడివేసే భూకామందుకుగానీ
తోవ కెదురువస్తివా, దొంగచూపుచూస్తివా
తంటా మనకిద్దరికీ తప్పదు మామయ్యా!
కంచెమీద గుమ్మడిపువు పొంచిపొంచి చూస్తాది
విరబారిన జొన్నపొట్ట వెకిలినవ్వునవ్వుతాది
తమలపుదీగెలకు కాళ్ళు తగిలి మొరాయిస్తాయి
చెదిరిపోకు మామయా, బెదిరిపోకు మామయా
సదురుకో నీ పదును గుండె, సక్కని మామయ్య
పనలుకట్టి నన్ను పలకరించబోయినపుడు
మోటబావివెనక నాతొ మోటసరసమాడినపుడు
చెరకుతోట మలుపుకాడ చిటికెవేసి నవ్వినపుడు
కసిరితిట్టినాననీ, విసిరికొట్టినాననీ
చిన్నబోకు, నలుగురులో సిగ్గది మామయ్య!
-- కొనకళ్ళ వెంకటరత్నం
తెలుగు కావ్యమాల, సంకలనము, కాటూరి వెంకటేశ్వరరావు
పంటబోదె వరిమడితో పకపక నవ్వేవేళ
సల్లగాలి తోట కంత సక్కలగిలి పెట్టేవేళ
మొక్కజొన్నతోటలో, ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో, మరవకు మామయ్య!
చీకటి మిణుగురుజోతుల చిటిలిచిల్లులడకమునే
సుద్దులరాగాలు చెవుల నిద్దురతీయకమునుపే
ఆకాశపుటొడిని తోట ఆవలింతగొనకమునే
పొద్దువాలుగంటనే, పుంతదారివెంటనే
సద్దుమణగనిచ్చి రా, ముద్దులమామయ్య!
గొడ్డుగోద మళ్ళేసే, కుఱ్ఱకుంకలకుగానీ
కలుపుతీతలయి మళ్ళే కన్నెపడుచులకుగానీ
బుగ్గమీస మొడివేసే భూకామందుకుగానీ
తోవ కెదురువస్తివా, దొంగచూపుచూస్తివా
తంటా మనకిద్దరికీ తప్పదు మామయ్యా!
కంచెమీద గుమ్మడిపువు పొంచిపొంచి చూస్తాది
విరబారిన జొన్నపొట్ట వెకిలినవ్వునవ్వుతాది
తమలపుదీగెలకు కాళ్ళు తగిలి మొరాయిస్తాయి
చెదిరిపోకు మామయా, బెదిరిపోకు మామయా
సదురుకో నీ పదును గుండె, సక్కని మామయ్య
పనలుకట్టి నన్ను పలకరించబోయినపుడు
మోటబావివెనక నాతొ మోటసరసమాడినపుడు
చెరకుతోట మలుపుకాడ చిటికెవేసి నవ్వినపుడు
కసిరితిట్టినాననీ, విసిరికొట్టినాననీ
చిన్నబోకు, నలుగురులో సిగ్గది మామయ్య!
-- కొనకళ్ళ వెంకటరత్నం
తెలుగు కావ్యమాల, సంకలనము, కాటూరి వెంకటేశ్వరరావు
0 Comments:
Post a Comment
<< Home