"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, October 22, 2008

India's First Lunar Mission launched from Andhra Pradesh


నింగికెగిరిన చంద్రయాన్‌-1
సంపూర్ణ ఫలితానికి 8 వరకూ ఆగాల్సిందే
శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
ఇతర దేశాల నుంచీ ప్రశంసలు
శ్రీహరికోట, నెల్లూరు- న్యూస్‌టుడే


ప్రపంచం మొత్తం ఆసక్తిగా మనవైపే చూస్తున్నవేళ.. గగనమంతా కరిమబ్బులు పందిళ్లు వేసినట్లు ఉన్న సమయాన.. సన్నని జల్లులే అక్షింతలైన శుభతరుణంలో.. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తన అవిరళకృషితో భారతావని కీర్తిని అంతరిక్ష చిత్రపటంలో ఆ'చంద్ర'తారార్కం చేసింది. భారతీయుల ప్రతిష్ఠను చందమామ నుంచి చాటేందుకు సిద్ధమైన చంద్రయాన్‌-1 ఉపగ్రహాన్ని తీసుకొని ప్రయోగ వాహకనౌక పీఎస్‌ఎల్‌వీ సి-11 బుధవారం ఉదయం 6.22 గంటలకు వీక్షకుల కరతాళ ధ్వనుల మధ్య శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీంతో చంద్రుడి మీదకు యాత్ర చేపట్టిన ఆరో దేశంగా భారత్‌ అవతరించింది. ఉరుములు, వర్షం మంగళవారం సాయంత్రం నుంచి శాస్త్రవేత్తలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. అయితే బుధవారం ఉదయానికల్లా వరుణుడు కరుణించాడు. దీంతో ప్రయోగాన్ని చేపట్టారు.

ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 255 కి.మీ.ల పెరిజి (భూమికి అతి దగ్గరగా ఉండే బిందువు).. 22,860 కి.మీ.ల అపోజి (భూమికి అతి దూరంగా ఉండే బిందువు)తో ఉన్న దీర్ఘవృత్తాకార భూకక్ష్యలోకి 1,380 కేజీల చంద్రయాన్‌ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సి-11 విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో 49 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జరిగిన చంద్రయాన్‌-1లోని తొలి దశ ప్రయోగం విజయవంతంగా ముగిసింది.

రెండోదశలో చంద్రయాన్‌ ఉపగ్రహం భూకక్ష్యను విడతలవారీగా పెంచుకొంటూ వెళ్లి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెడతారు. మూడోదశలో చంద్రుని చుట్టూ 100 కి.మీ.ల దూరంలో రెండేళ్లపాటు పరిభ్రమించేలా చంద్రయాన్‌ ఉపగ్రహ కక్ష్యలను నియంత్రిస్తారు. ఇందుకోసం ఉపగ్రహంలో ఉన్న లిక్విడ్‌ అపోగీ మోటార్‌ (లామ్‌)ను అవసరమైన సమయంలో పేలుస్తారు. అనంతరం ఉపగ్రహంలోని 11 ప్రయోగ పరికరాలను పనిచేసేలా చేస్తారు. దీంతో చంద్రయాన్‌ ఉపగ్రహం పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లు ధ్రువీకరిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం నవంబరు 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ పనిని ఇస్రోకు చెందిన టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఇస్ట్రాక్‌) చేపడుతుంది. నవంబర్‌ 8 తరువాత చంద్రయాన్‌-1 నుంచి వచ్చే సంకేతాలను బెంగళూరుకు సమీపంలోని బ్యాలాలులో ఉన్న డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ (డీఎస్‌ఎన్‌) చేపడుతుంది.

1,380 కేజీల చంద్రయాన్‌ ఉపగ్రహంలో 880 కేజీల ఇంధనాన్ని నింపారు. ఇందులో సుమారు 760 కేజీల ఇంధనాన్ని ఉపయోగించుకొని ఉపగ్రహం భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్యలోకి చేరుకోగలుగుతుంది. చంద్రుని కక్ష్యలోకి చేరే సమయానికి ఉపగ్రహంలో సుమారు 100 నుంచి 120 కేజీల ఇంధనం మాత్రమే మిగులుతుంది. ఇది చంద్రుని చుట్టూ పరిభ్రమించే సమయంలో ఉపగ్రహాన్ని నియంత్రించేందుకు ఖర్చవుతుంది.

చంద్రయాన్‌-1 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించడంతో షార్‌లోని మిషన్‌ కంట్రోల్‌లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. చంద్రయాన్‌-1.. భారతీయులకు ఓ మధుర జ్ఞాపకమని ఇస్రో ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రయాన్‌-1 ప్రాజెక్టు డైరెక్టర్‌ మైలస్వామి అన్నాదురై మాట్లాడుతూ.. ''మా బేబీ జాబిలి దిశగా పయనం ఆరంభించింది'' అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లు ఇస్రోకు అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కూడా ఇస్రోపై ప్రశంసల జల్లు కురిపించాయి. రూ.386 కోట్లతో చేపట్టిన చంద్రయాన్‌-1.. ఇప్పటి వరకూ చేపట్టిన అంతరిక్ష యాత్రలన్నింటిలోకి అత్యంత చౌకైనదిగా భావిస్తున్నారు. చంద్రయాన్‌-1 తొలిసారిగా చంద్రుడి త్రీడీ మ్యాప్‌లు తయారుచేస్తుంది.
Courtesy: ఈనాడు
*****

Hyderabad, Oct 22 (IANS) Andhra Pradesh Chief Minister Y.S. Rajasekhara Reddy Wednesday congratulated Indian space scientists on the successful launch of the country’s first unmanned moon mission Chandrayaan-I. The chief minister, in his congratulatory message to Indian Space Research Organisation (ISRO) chief Madhavan Nair, said it was a truly historic moment for the entire country and “more so for Andhra Pradesh since it is from our soil that the Chandrayaan-I lifted off successfully”.

“I wholeheartedly congratulate all the space scientists and all others connected with the Chandrayaan-I mission. The whole nation is proud of you all today as India enters the moon club.”

Wednesday morning’s launch was a historic and momentous event, he said.

“I am happy that the launch was perfect and precise. With this, we have completed the first leg of the mission and it will take 15 days to reach the lunar orbit.”

The chief minister hoped that the mission will help Indian scientists locate He-3, which has the potential to produce a large amount of energy. The scientists hope to transport it to the earth to run nuclear plants.

The 44.4-metre-tall, 316-tonne rocket, Polar Satellite Launch Vehicle (PSLV-C11), had a copybook launch at 6.22 a.m. from Sriharikota in Andhra Pradesh Wednesday morning and completed its mission by placing Chandrayaan-1 into its scheduled orbit around the earth within 18 minutes, as planned.

The spacecraft carries 11 scientific instruments, five from India and six from universities and laboratories of the European Space Agency, the US and Bulgaria.

Courtesy: ThaIndian

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home