త్వరలో తెలుగుకు ప్రాచీన భాష హోదా
అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎ.బి.కె.ప్రసాద్
కాకినాడ సిటీ, జులై 8 (న్యూస్‌టుడే): తెలుగుకు ప్రాచీన హోదా కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, త్వరలోనే ప్రధానమంత్రి దీనిపై ఒక ప్రకటన చేయగలరని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎ.బి.కె.ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శనివారం తెలుగుపై నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లోనూ మాతృభాష సబ్జెక్టుగా ఉండాలని ప్రభుత్వం 2003-2004లో విడుదల చేసిన ఉత్తర్వులను (జి.ఒ. 86) 2007-08 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30 శాతం మంది తెలుగు పిల్లలు తమ తల్లిభాష నుంచి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రాచీన భాష అని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నీ ప్రభుత్వం నియమించిన లక్ష్యసాధన సమితి (టాస్క్‌ఫోర్స్) కేంద్రానికి సమర్పించిందని తెలిపారు. ఈ వాదనలతో సంబంధిత మంత్రి కూడా ఏకీభవించి ప్రధానికి సూచించారని, ఈమేరకు అనుకూల ప్రకటన వెలువడే అవకాశం ఉందని వివరించారు. ప్రాచీన భాష హోదా కల్పించేందుకు ప్రభుత్వంలో వ్యతిరేకతగా లేదన్నారు. అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనే రూపొందించేలా చర్యలు తీసుకున్నామని, సుమారు 40 ప్రభుత్వ శాఖల పారిభాషిక పదాలను క్రోడీకరించి తెలుగులో వాడుకలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, మరో రెండు నెలల్లో ఇందుకు సంబంధించి ఒక పుస్తకాన్ని ముద్రించనున్నట్లు వెల్లడించారు. సంఘం కార్యకలాపాల కోసం ప్రభుత్వం రూ.80 లక్షల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు.
Courtesy:ఈనాడు
tcld2006
Labels: tcld2006
1 Comments:
nike huarache
hermes bags
supreme clothing
vapormax
retro jordans
air max 270
goyard
golden goose outlet
golden goose
golden goose outlet
Post a Comment
<< Home