ఉపాధితో సంబంధం లేకుండా ఏభాషా అభివృద్ధి కాదు
ఎం.వి. ఆంజనేయులు
తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలన్న కోరిక నానాటికీ తెలుగునాట బలపడుతున్నది. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలన్న కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం కూడా చేసింది. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలనే విషయంలో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. కాని ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలోనే అనేక పొరపాటు ధోరణులు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.
ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో అనేకమంది తెలుగుభాష, ఆంధ్ర భాష ఒకటేననే విధంగా పొరపాటు అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. చాలాకాలంగా తెలుగు వాజ్ఞ్మంలో తెలుగు, ఆంధ్ర అనుపదాలు పర్యాయపదాలుగా వాడుకలో ఉండడమే వారు అలా అభిప్రాయపడటానికి కారణమై ఉండవచ్చు. భాషకు సంబంధించిన పేరు ఏదైనా పెద్ద ఇబ్బంది కలుగదుకాని, తెలుగు భాష యొక్క ప్రాచీనతను గుర్తించాలంటే మాత్రం ఈ రెండు పదాల యొక్క అర్ధాలను తెలుసుకోవల్సిందే.
తెలుగు అనేది భాషకు పేరు. ఆంధ్ర అనేది ఒక తెగప్రజలకు పేరు. ఆంధ్రులు అనేవారు ఒకతెగ ప్రజలు, ద్రావిడుల తర్వాత భారతదేశంలోకి అడుగిడిన తెగయిది . ఆర్యులకన్నా కొన్ని శతాబ్దాల ముందే ద్రావిడులు భారతదేశంలోకి వచ్చారు. వీరు మొదట భారతదేశ ఉత్తర ప్రాంతంలో నివసించేవారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన హరప్పా, మొహంజదారో, నాగరికతలను నిర్మించింది ఈ ద్రావిడులే. ఆ తదుపరి వీరిలో కొన్ని తెగలు ఆర్యుల చేతిలో పరాజితులై భారతదేశపు దక్షిణప్రాంతానికి తరలివచ్చారు. దక్షిణభారత దేశంలో స్థిరపడ్జారు, కొంత మంది ఉత్తరభారతదేశంలోనే నిలిచిపోయారు, మరికొంతమంది మధ్య భారతదేశంలో నివాసాలను ఏర్పచుకున్నారు, కొంతమంది నేపాల్, బర్మాలవైపుగా సాగిపోయారు.
దక్షిణ భారతదేశానికి తరలివచ్చిన ద్రావిడ తెగలు తెలుగు, తమిళం , కన్నడం, తుళూ భాషలను మాట్లాడేవారు, మధ్య భారతదేశంలో స్థిరపడిన ద్రావిడ తెగలు కాండు, మార్టు, ఒరేయాన్, భాషలు మాట్లాడేవారు. దక్షిణ, మధ్య భారతదేశంలో ద్రావిడులు మాట్లాడే ఈ భాషలన్నీ ద్రావిడభాషా కుటుంబానికి చెందినవి. బర్మాలో నివశిస్తున్న తైలాంగ్ జాతి ప్రజలు కూడా తెలుగు వారేనని కొంతమంది భాషాపండితుల అభిప్రాయం. దీనిని బట్టి తెలుగు భాషా తమిళ భాషాంత ప్రాచీన మైనదని స్పష్టమౌవుతున్నది.
ఇక ఆంధ్రుల విషయానికి కొస్తే ఆంధ్రులు అనేవారు ఒక తెగ ప్రజలు ద్రవిడులు దక్షిణ ప్రాంతానికి తరలివచ్చిన కొన్ని శతాబ్దాల తర్వాత ఆంధ్రులు భారతదేశంలోకి అడుగు పెట్టారు. చరిత్రకు అందుతున్న వివరాల ప్రకారం క్రీ.పూ.1500 నాటికి ఆంధ్రులు యమూనా తీరంలో నివసించేవారు. వీరి భాష 'దేశి' అక్కడ సమాజంలో ఏర్పడిన ఒడిదుడుకుల వలన, కరువు కాటకాల వలన ఆంధ్రులలో కొందరు యమునా తీరాన్ని వదిలి వింధ్యా పర్వతాలకు దక్షిణంగా సాగిపోయారని క్రీ.పూ.1000 సంవత్సరాల ప్రాంతంలో రచింపబడిన చాందోగ్యోపనిషత్తు ద్వారా తెలుస్తున్నది. అలా తరలి వచ్చిన ఆంధ్ర తెగలు క్రమేణ మరాఠ్వాడ, తెలంగాణా ప్రాంతాల మీదుగా క్రీ,పూ.200 నాటికే ప్రస్తుత ఆంధ్ర ప్రాంతానికి చేరుకొని స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. కొత్తగా వచ్చిన ఆంధ్రుల భాష 'దేశీ, ఆంధ్రులు ఈ ప్రాంతంలో స్థిరపడిన తర్వాత వారి భాష 'దేశి, దార్ధిక్, ద్రావిడ భాషా కూటములు రెండు సమీప బంధుత్వం గలవి కనుకనే, దేశి, తెలుగు భాషలు సులభంగా మిళితమైపోయాయి.ప్రస్తుతం మనం మాట్లాడే తెలుగు ఈ రెండు భాషలు సమ్మిళితమే.
ఈచర్చలో రెండవ పొరపాటు ధోరణి ఏమంటే భాషా ప్రాచీనతను లెక్కించడానికి, శిలాశాసనాల ప్రాచీనతను కొలబద్దగా తీసుకోవడం. భాష ఏర్పడిన కొన్ని శతాబ్దాల తర్వాతే, ఏ భాషకైనా లిపి ఏర్పడుతుంది తప్ప భాష పుట్టుకతోనే లిపి ఏర్పడదు. ఏ భాషలైనా ఇదే పరిస్థితి. ఇది భాషా పరిణామక్రమం.
తెలుగు భాష ఇందుకు భిన్నంకాదు. ఇప్పటి వరుకు అందిన చారిత్రక అంచనాల ప్రకారం , క్రీ.పూ 2వేల సంవత్సరాలనాటికే తెలుగుభాష ఏర్పడింది. అంటే, క్రీ.పూ 1వ శతాబ్దిలోనే , శాతవాహనుల కాలంలో అమరావతి స్థూపంలో చెక్కిన ''నాగబు''అనే పదం ఇప్పటివరుకు దొరికిన ప్రాచీన శాసనపదం. అందువలన శాసనకాలం ఎప్పుడూ భాష వయస్సును నిర్ణయ ంచదు. తెలుగు భాష కూడా శాసనాలలోకి ఎక్కకముందు సుమారు 2వేల సం.లకు పూర్వం నుండే యున్నదని స్పష్టమౌవుతుంది . పై విషయాలనుబట్టి క్రీ.పూ 2వేల సం.ల నాటికే , అంటే ద్రావిడుల ఉత్తర భారతదేశం నుండి , దక్షిణ భారత దేశంలోకి వచ్చెనాటికే తెలుగు భాష ఉన్నదని స్పష్టమౌవుతున్నది. కనుక తెలుగు భాష ను ప్రాచీన భాషగా గుర్తించడానికి ఎలాంటి ఆటంకామూ లేదు.
ఈచర్చలో ఉన్న మరోపొరపాటు ధోరణి తమిళుల పై ద్వేషాన్ని రెచ్చగొట్టడం. తెలుగు భాషను ప్రాచీన భాషగా ప్రభుత్వం గుర్తించకుండా తమిళులు అడ్డుతలుగుతున్నారని కొంతమంది ప్రముఖులే విద్వేషపూరిత ప్రచారం చేయడం శోచనీయం. తెలుగు భాష ప్రాచీనతను గుర్తించడానికి తమిళులు అడ్డుతగలడమేమిటి? తమిళులు కాదంటే తెలుగుభాష ప్రాచీన భాష కాకుండా పోతుందా? చరిత్ర పరిశోధన ఆధారంగా భాషాప్రాచీనతను గుర్తించాలని కోరాలే తప్ప ఇతర భాషీయులపైన ద్వేషాన్ని రేచ్చగొట్టడం ద్వారా కాదు . మనభాషమీద మనకు ప్రేమ ఉండవచ్చుగాని , ఇతర భాషీయుల పట్ల ద్వేషం తగదు.
అసలు తెలుగుభాషను ప్రాచీన భాషగా భారతప్రభుత్వం గుర్తించినంత మాత్రాన సాధారణ తెలుగు ప్రజలకు ఒరిగేదేమిటి ? భాషను ప్రాచీన భాషగా గుర్తిస్తే , భాషాభివృద్ది పేరుతో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని నిధులొస్తాయి. నిధులతోనే భాషాభివృద్ది జరిగిపోతుందా? ప్రాచీన భాషగా గుర్తిస్తే తప్ప మాతృభాషలను అభివృద్ది చేయవలిసిన అవసరం లేదా? మాతృభాషను అభివృద్ది చేసేది ప్రజలకు విజ్ఞానాన్ని కరతలామలకం చేయాడానికేగాని ప్రాచీన భాష కాబట్టి కాదు.
తెలుగు ప్రాంతంలో ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పిస్తే తెలుగు భాషను ప్రజలు ఆదరిస్తారు. తద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది. భాషాప్రయుక్తరాష్ట్రాలను ఏర్పాటుచేసిన లక్ష్యాలను మన పాలకులు ఏనాడో గాలికి వదిలేశారు. చైనా, రష్యా, జర్మని ఫ్రాన్స్ లాంటి దేశాలలో వారి విద్యా బోధన వారి మాతృభాషలోనే జరుగుతుంది. వారికి ఆంగ్లం నేర్చుకోవడం ద్వితీయ తప్ప ప్రథమం కాదు. కారణం ప్రపంచంలో పెరుగుతున్న విజ్ఞానాన్ని వారి భాషలలోకి అనువదించుకోవడమే . రెండవది, వారికి అక్కడే ఉపాధి లభిస్తున్నది. ఈ రెండు కారణాల చేత వారి భాషలలోనే శాస్త్రసాంకేతిక అభివృద్ధి జరుగుతుంది. మన తెలుగు భాషా అభివృద్ధి జరగాలన్నా ఈ రెండు జరగవలసిందే. కానీ మనం తెలుగు భాషలో పరిపాలనే నిర్వహించుకోలేని స్థితిలో ఉన్నాము. తెలుగు శాసన సభలో సభ్యులందరూ తెలుగులో మాట్లాడాలేని దుస్థితి మనది. కనుక తెలుగు భాషాభివృద్దిని కాంక్షించే వారందరూ ఉపాధి అవకాశాల కోసం, శాస్త్ర సాంకేతిక గ్రంథాలను అనువదించే యంత్రాంగం ఏర్పాటు కోసం పరిపాలనలో పూర్తిగా తెలుగును ప్రవేశపెట్టడం కోసం పోరాడాలి. అప్పుడే నిజంగా తెలుగు భాషాభివృద్ధి జరుగుతుంది.అసోంలో కాంగ్రెస్‌కు కాంగ్రెస్సే ప్రత్యర్ధి
తేజ్పూర్, ఏప్రిల్ 7;అసోంలో కాంగ్రెస్‌కు కాంగ్రెస్సే ప్రత్యర్ధిగా మారింది. బార్పేటా నియోజకవర్గం నుండి మూడు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికైన గోలామ్ ఉస్మాని ఈ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగానే ప్రచారం చేయడంమే కాకుండా 21 మంది స్వతంత్ర అభ్యర్ధుల బహుటంగా రంగంలోకి దింపి వారి తరుపున ప్రచారం చేస్తున్నారు. బహుస కాంగ్రెస్‌తో ముఖ మూఖీగా పోటిపడే ధైర్యం లేక ఆయన ఈ ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో రాజీనామా చేసానని, అయితే తన రాజీనామాను పార్టీ అధిష్టానం అంగీకరించవలసి ఉందని ఉస్మాని అన్నారు. దిగువ అసోంలోని కాంగ్రెస్ అభ్యర్ధులందరిని తాను ఓడిస్తానని అన్నారు. దిగువ అసోంలో తాను బలపరిచిన అభ్యర్ధులే విజయం సాధిస్తారని, ఈ ప్రాంతంలోని ధర్మాపూర్‌తో సహా మిగిలిన స్ధానాల్లో ఒక్క కాంగ్రెస్ అభ్యర్ధి కూడా విజయం సాధించడని ధీమా వ్యక్తం చేశారు. మైనారిటీల కాపాడేందుకు, వారి అభివృద్ధి కోసం పాటుపడమని తాను కాంగ్రెస్‌కు చెబుతున్నా, లెక్కపెట్టకుండా కేవలం కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌పైనే ఆదారపడిందన్నారు. తన సామర్జ్యాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గుర్తించారని, తాను సూచించిన అభ్యర్ధులనే అమె జాబీతాలో ఎంపిక చేశారని, అయితే చివరి నిమిషంలో ముఖ్యమంత్రి తురుణ్‌గొగోయ్, దిగ్విజయ్‌సింగ్‌లు తాను సూచించిన అభ్యర్ధులకు సీట్లు కేటాయించకుండా అడ్డుపడ్డారని అన్నారు. తన మద్దతు దారులైన 30మంది టిక్కెట్లు ఇవ్వాలంటూ సూచించానని, వారిలో ఆరుగురికి మాత్రమే దిగ్విజయ్‌సింగ్ సీట్లను కేటాయించారని అన్నారు. దీంతో తాను పార్టీతో విభేదించి పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నానని, ఎన్నికల అనంతరం తాను కీలకపాత్ర పోషిస్తానని అన్నారు.
మైనారిటీ ఓటు బ్యాంక్‌కు గండిపడకుండా కాంగ్రెస్ చేసే చర్యలు నిలుపుచేయకపోతే, మీరు లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకుంటారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, కాంగ్రెస్ మైనారిటీల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తే తాను లోక్‌సభకు రాజీనామా ఎందుకు చేస్తానని ఎదురు ప్రశ్నించారు. తాను పదవికి రాజీనామా చేస్తే కేవలం సభ్యత్వం పోతుంది. మాహ అయితే పార్టీ నుండి బహిష్కరిస్తారు. తాను ఉత్తరాంచల్‌నుండి తిరిగి గెలుపొందగలనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తాను పార్టీకి రాజీనామా చేస్తాని ప్రకటించడంతో, అసోంలో హంగ్ అసెంబ్లీ ఏర్పాడే అవకాశమున్నందు వలన ఉస్మాన్ కీలక పాత్ర పోషించగలడని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
Telugu Andhra Pradesh ancient classical language status demand M.V.Anjaneyulu tcld2006
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home