పాప్ సంగీత ప్రపంచాన్ని కొన్నేళ్లపాటు శాసించిన మైకెల్ జాక్సన్ (50) శుక్రవారం వేకువజామున స్థానిక కాలమానం ప్రకారం 2.26 గంటలకు మృతి చెందారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
రాత్రి గుండెపోటు రావడంతో లాస్ ఏంజెలెస్‌లోని ఓ ఆస్పత్రికి జాక్సన్‌ను తీసుకెళ్లారు.
అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే ఆయనలో చలనం లేదని లాస్ ఏంజెలెస్ కౌంటీ కార్నర్స్ కార్యాలయ ప్రతినిధి ఫ్రెడ్ కారల్ సీఎన్ఎన్ ఛానల్‌తో చెప్పారు. రాత్రి 12.30 గంటల సమయంలోనే జాక్సన్‌కు గుండెపోటు వచ్చినట్లు లాస్ ఏంజెలెస్ అగ్నిమాపక శాఖ వైద్య సిబ్బందికి సమాచారం అందించారు.
ఆ సమయంలోనే జాక్సన్ శ్వాస తీసుకోవడం లేదు. అనంతరం ఆయనను వైద్య సిబ్బంది రోనాల్డ్ రీగన్ యూసీఎల్ఏ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లిన తరువాత వైద్యులు ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు. మైకెల్ జాక్సన్‌కు అంతిమ నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఆస్పత్రి వద్ద, ఆయన నివాసం వద్ద గుమిగూడారు.
Courtesy: వెబ్దునియా
చాలా చక్కగా బ్లాగ్ ను నిర్వహిస్తున్నారు. అబినందనలు.
ReplyDeleteనా బ్లాగును కూడా చూసి మీ అమూల్యమైన అబిప్రాయాన్ని తెలియపరుస్తారని
ఆశిస్తున్నాను.
మీ రాజేష్ (http://vipanchi.blog.co.in)
Send breathtaking gifts to USA and make a beguiling focal point to any celebration. Add unique beauty and style to the occasions of your special ones in USA with our exotic range of gifts.
ReplyDeletePlease visit:
www.expressgiftbasketsusa.com