Sunday, July 08, 2007

ప్రపంచ అద్భుతం తాజ్‌మహల్‌


తాజ్‌... మళ్లీ వహ్‌ఁ అనిపించింది. ఆధునిక ప్రపంచంలోని ఏడు అత్యద్భుతాల్లో చోటు దక్కించుకుంది. ఈ పాలరాతి ప్రేమ కట్టడానికి ప్రపంచవ్యాప్తంగా జనం పట్టం కట్టారు. ఆదివారం తెల్లవారుఝామున 3.40కి ఈ తీపి కబురును బాలీవుడ్‌ సుందరి బిషాసా బసు ప్రపంచానికి ప్రకటించారు. స్విట్లర్లాండ్‌కు చెందిన 'న్యూసెవెన్‌ వండర్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌' సంస్థ పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన వేడుకల్లో ఏడు అత్యద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. అవి.. తాజ్‌ మహల్‌ (భారత్‌); రోమన్‌ కలోసియమ్‌ (ఇటలీ); చిచెన్‌ ఇజా (మెక్సికో), మాచ్యు పిచ్యు (పెరూ), క్రైస్ట్‌ రెడీమర్‌ (బ్రెజిల్‌), పెట్రా (జోర్డాన్‌), గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా (చైనా). ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌, ఫోన్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పది కోట్ల ఓట్లు పోలయ్యాయి. కొత్త ప్రపంచ వింతలకు తాము అధికారికంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వబోమని యునెస్కో ప్రకటించినా... ఈ పోటీపై విశ్వవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా భారత్‌లో తాజ్‌ కోసం భారీ ప్రచారం జరిగింది.

Courtesy: ఈనాడు
Taj Mahal Telugu seven 7 wonders wonder 7th seventh India Agra

1 comment: