Saturday, May 12, 2007

హైదరాబాద్‌లో గూగుల్ టెక్నో-క్యాంపస్‌

At it's headquarters in Mountain View, California

హైదరాబాద్‌, మే 11ః ఇంటర్‌నెట్‌ సెర్చ్‌ ఇంజన్‌ ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో అగ్రశ్రేణి కంపెనీగా నిలిచిన గూగుల్‌ హైదరాబాద్‌లో సరికొత్త డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గూగుల్‌ కొత్తగా ఏర్పాటు చేసే కేంద్రానికి కోకాపేట గ్రామంలో 20 ఎకరాల హుడా భూమిని కేటాయించనున్నారు. ఈ మేరకు ఈ నెల 9న అమెరికాలోని శాంతాక్లారాలో అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సమక్షంలో ఐటి శాఖ కార్యదర్శి శైలేంద్రకుమార్‌జోషి, గూగుల్‌ డైరక్టర్‌ (ఆన్‌లైన్‌ సేల్స్‌- ఆపరేషన్స్‌) రాయ్‌గిలబెర్ట్‌లు ఎంవోయుపై సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి ఆర్‌. దామోదర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీజు భవనంలో కార్యకలాపాలు సాగిస్తున్న గూగుల్‌లో 1088 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం కేటాయించే నూతన స్థలంలో పూర్తిశ్రేణి క్యాంపస్‌ ఏర్పాటు ద్వారా ఉద్యోగుల సంఖ్యను 4000 పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో గూగుల్‌ పెట్టుబడుల కొనసాగింపులో భాగంగానే ఈ కొత్త కేంద్రం అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో గూగుల్‌ ఉత్పత్తులు, సేవలకు మంచి ఆదరణ లభిస్తున్నదని, కంపెనీ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని గూగుల్‌ ఇండియా డైరెక్టర్‌ రాయ్‌ గిల్బర్ట్‌ పేర్కొన్నారు.

Courtesy: ఆంధ్ర జ్యోతి

*****

Google to set up techno-campus in Hyderabad


Signs a memorandum of understanding with the State Government

HYDERABAD: After software majors like Microsoft and Infosys, Hyderabad will host a new techno-complex of Google Inc., the innovator of search technologies connecting millions of people seeking information.

Google, acclaimed as the world's best search engine with a market capitalisation of over $150 billion, will set up its state-of-the-art techno complex in Hyderabad. The company's present facility, on a leased premises, comprises over 1,000 employees and is the second biggest in the country.

The new facility, catering to engineering, online sales and service, information systems and other support functions, is expected to house 4,000 people once it becomes fully operational and the company proposes to raise the headcount further based on the business needs.

Google Inc. entered into a memorandum of understanding with the State Government for setting up the centre in Hyderabad during Chief Minister Y. S. Rajasekhara Reddy's visit to Santa Clara in the U.S. on Wednesday.

Google's online sales and operations director, Roy Gilbert, signed the MoU on behalf of the company while Information Technology Department Secretary, S. K. Joshi, represented the State Government. As part of the MoU, the Government will allot 20 acres at Kokapet in Rajendranagar mandal to the company, an official release said. Welcoming Google's decision to invest in the State, the Chief Minister said such investments would help in accelerating economic growth in addition to providing gainful employment.

Courtesy: The Hindu


1 comment: