నవంబరులో రాష్ట్రానికి ష్క్వార్జ్‌నెగర్
టెర్మినేటర్, హాలీవుడ్ హీరో, అమెరికాలో అతిపెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియా గవర్నరు ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగర్ నవంబరులో ఉన్నతస్థాయి బృందంతో కలిసి హైదరాబాద్ రానున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వై.ఎస్. ఆయనతో సమావేశమైన సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, కాలిఫోర్నియా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత విస్తృత పరిచేందుకు కృషిచేయాలని ఇద్దరు నేతలూ నిర్ణయించారు. ఐటీ, బీటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, బీపీవో, సూక్ష్మసేద్యం, నీటి నిర్వహణ రంగాల్లో పెట్టుబడులతో రావాలని ముఖ్యమంత్రి కోరగా ఆర్నాల్డ్ అంగీకరించారు. కాలిఫోర్నియా, ఆంధ్రప్రదేశ్‌లలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నందున ఈ భేటీలో నీటి నిర్వహణ, పొదుపు అంశాలకు వారు ప్రాధాన్యమిచ్చారు. 'ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశంలోనే మీరెంతో ప్రముఖుడిగా పేరొందారు. రైతు, ఆధునిక పరిపాలకునితోపాటు ముఖ్య రాజకీయ నేత' అని వైఎస్‌ను కాలిఫోర్నియా గవర్నరు ప్రశంసించినట్లు శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని ఆర్నాల్డ్ తెలిపారు. దీనికి వైఎస్ స్పందిస్తూ 'మీరు చాలాకాలం నుంచి భారత్‌లో ప్రజాదరణ ఉన్న యాక్షన్ హీరో. ప్రతిచోటా మీకు అభిమానులున్నారు' అంటూ ప్రశంసించారు. ఈ భేటీలో వైఎస్ వెంట ఐటీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ ఆత్మచరణ్‌రెడ్డి, ఐటీ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, సీఎం ముఖ్య కార్యదర్శి జన్నత్ హుస్సేన్ ఉన్నారు. కాలిఫోర్నియా లెఫ్టినెంట్ గవర్నరు జాన్ గారామెండీ వీరికి తేనీటి విందు ఇచ్చారు.
Courtesy: ఈనాడు
*****
HYDERABAD: California Governor Arnold Schwarzenegger will visit Hyderabad in November as the head of a trade, information technology and cultural delegation to discuss mutual cooperation and investment opportunities in Andhra Pradesh.
This was decided when Chief Minister Y. S. Rajasekhara Reddy, now on a U.S. tour, met the California Governor on the latter's invitation on Wednesday. Dr. Reddy, who flew to California along with his delegation, in a private jet, urged Mr. Schwarznegger to explore possibilities of investments in IT, biotechnology, pharma, food processing, business process outsourcing, micro-irrigation and water conservation.
Courtesy: The Hindu
1 Comments:
ray ban sunglasses
kate spade outlet
polo ralph lauren
gucci shoes
coach outlet store
kate spade sale
oakley sunglasses
ugg outlet
atlanta falcons jerseys
bengals jersey
2017.8.23
Post a Comment
<< Home