"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Tuesday, November 21, 2006

తెలుగువేరు, ఆంధ్రం వేరు!

-కనకదుర్గ దంటు

...శంకరంబాడి సుందరాచారి అని బాపట్లకి చెందిన ఒక కవి ఈ తెలుగు తల్లిని సృష్టించాడు. అప్పటిదాకా ఎవరు రాసినా, ఎవరు మాట్లాడినా 'ఆంధ్ర' అన్న పదమే వాడేవారు. అయితే ఆంధ్ర అన్నది సంస్క­ృతానికి దగ్గరగా ఉండడంతో, లాలిత్యాన్ని తన పాటలో జొప్పించడానికి మొట్టమొదటి దోపిడీదారుగా ఆయన తెలంగాణకి సంబంధించిన 'తెలుగు' అన్న పదాన్ని దొంగిలించి తన పాటలో పెట్టుకున్నాడు.

ఈమధ్య తెలుగుతల్లి గురించిన వాదోపవాదాలు వాడిగా, వేడిగా సాగుతున్నాయి. తెలుగు అనేది వారి సొత్తయినట్టు, తెలుగుతల్లి అంటే వారొక్కరి తల్లి అయినట్టు ఆంధ్ర సోదరులు ఆవేశపడిపోతున్నారు. ఏదైనా ఒక విషయాన్ని అందరూ ఆమోదించినపుడు ఏ బాధలేదు. కానీ దాని గురించి భిన్నాభిప్రాయాలు వెలువడేటప్పుడు, కొద్దిగా చారిత్రక, సాంస్క­ృతిక నిజాలు తరచి చూడటం ఎంతైనా అవసరం. అందుకే ఈ 'తెలుగు' అన్నపదం ఎప్పటిది, ఎందుకు, ఎక్కడ, ఎలా ఉపయోగించబడింది అన్న విషయాన్ని కొంచెం విశ్లేషిద్దాం.

తెలుగు అన్న పదం భాషాపరంగా చూస్తే త్రిలింగ అన్న పదానికి దగ్గరగా ఉంది. చారిత్రకంగా త్రిలింగదేశంలో ఉన్నవాళ్లని అప్పటి ముస్లిం పాలకులు 'తెలుగు' ప్రాంతమనీ వారు మాట్లాడే భాషని 'తెలుగు', 'తెలంగి' అన్నట్టు మనకు తెలుస్తోంది. ఉర్దూలో తెలుగును తెలంగి అంటారు. ఇది క్రమంగా తెలుగు అయింది అనుకోవచ్చు. అంటే త్రిలింగదేశంలో ఉన్నవారు తెలుగువారు. త్రిలింగదేశం అంటే- ఒకవైపు కరీంనగర్‌లోని కాళేశ్వరం, ఇంకోవైపు ద్రాక్షారామం, దక్షిణంవైపు శ్రీశైలం- ఈమూడు లింగేశ్వర క్షేత్రాల మధ్యనున్న ప్రదేశం. ఇది 95 శాతం తెలంగాణలోకి వస్తుం ది. అంటే ఇప్పటి తెలంగాణ వారు మాత్రమే తెలుగువారు అనుకోవలసి వస్తుంది. తెలుగు తెలంగాణ వారి స్వంతభాష. మాతృభాష. మహాకవి పోతన భాగవతాన్ని కూడా ప్రథమంగా ప్రచురించినప్పుడు తెలుగు భాగవతమనే ప్రచారంలో ఉండేది. తరువాత ఆంధ్ర ప్రచురణకర్తలు దానిని శ్రీమదాంధ్ర భాగవతంగా మార్చి, పోతననికూడా ఆంధ్రీకరించేశారు. ఈ 'ఆంధ్ర' అన్న పదానికి ఉన్న విశిష్టతని, దాని పూర్వాపరాలని పరిశీలిస్తే, ఆంధ్రం, తెలుగు అన్నవి వేరు జాతులనీ, వేరు భాషలనీ అర్థమవుతుంది.

తెలుగు భాషని, తెలుగుతల్లిని ఉద్ధరిస్తున్నామంటున్న ఇప్పటి సోదరుల జాతి ' ఆంధ్రజాతి'. వారు తెలుగు వారు కాదు. 9 వేల ఏళ్లకిందట రాసిన వాల్మీకి రామాయణంలో (ఈకాలంలో కూడా సరికాకపోవచ్చు, ఎందుకంటే రామాయణకాలానికి ఇప్పటికీ సరైన ఆధారాలు ఎవరూ చూపించలేదు), 5 వేల ఏళ్ల క్రింద జరిగిన శ్రీకృష్ణుడి కాలంలో బిసి 3127లో రాసిన మహాభారతంలో 'ఆంధ్ర' జాతి అన్నమాట వాడబడింది. దండకారణ్యం క్రిందభాగంలో నివశించే వారిని (అంటే ఇప్పటి ఆంధ్రప్రాంతం) ఆంధ్రజాతిగా వ్యవహరించడమైంది. మౌర్యుల కాలంలో భారతదేశానికి వచ్చిన మెగస్తనీస్‌ ఆంధ్రుల గురించి రాయడం చరిత్రలో చూస్తాం. సుమారు 1100 ఏళ్ల కిందట అంటే నన్నయ కాలంలో కూడా ఆంధ్రప్రాంతం వారిని ఆంధ్రులనే అన్నారుగానీ, తెలుగువారని అనలేదు. కవిత్రయం వేదవ్యాసుని సంస్క­ృత భారతాన్ని 'ఆంధ్రీకరించారే'కానీ 'తెలుగీ'కరించలేదు. ఈ రోజుదాకా ఎన్ని రకాల భారతాలు ప్రచురించినా అవి 'ఆంధ్ర భారతాలు' అయ్యాయే కానీ పుస్తకం మీద ఎక్కడా తెలుగు భారతం అని ఉండదు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ ముందు వచ్చిన మాయాబజార్‌ సినిమాలో కూడా గోంగూరని 'ఆంధ్రమాత' అని కీర్తించారేగానీ, 'తెలుగుమాత' అని అనలేదు. అంటే ఆంధ్రజాతి, ఆంధ్రభాష కచ్చితంగా వేరు అనేగా!

ఇక ఆంధ్రవాళ్ళకి ఊతపదంగా తెలుగు ఎలా వచ్చిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాంస్క­ృతికపరంగా- స్వతంత్రం రాకముందు- శంకరంబాడి సుందరాచారి అని బాపట్లకి చెందిన ఒక కవి ఈ తెలుగు తల్లిని సృష్టించాడు. అప్పటిదాకా ఎవరు రాసినా, ఎవరు మాట్లాడినా 'ఆంధ్ర' అన్న పదమే వాడేవారు. అయితే ఆంధ్ర అన్నది సంస్క­ృతానికి దగ్గరగా ఉండడంతో, లాలిత్యాన్ని తన పాటలో జొప్పించడానికి మొట్టమొదటి దోపిడీదారుగా ఆయ న తెలంగాణకి సంబంధించిన 'తెలుగు' అన్న పదాన్ని దొంగిలించి తన పాటలో పెట్టుకున్నాడు. అయితే అప్పుడు తెలంగాణ నిజాం పాలనలో ఉండి, ఆంధ్రతో ఎక్కువ సంబంధాలు లేక ఈ విషయం కూడా ఎవరికీ తెలియలేదు. ఇలా భాషాచోరత్వంతో మొదలైన దోపిడీ నీళ్ళు, నిధులు, నియామకాలు మొదలైన అన్ని విషయాలలోకి పాకింది.

రాజకీయపదంగా ఈ పదాన్ని దొంగిలించిన ఘనత తెలుగు దేశం స్థాపకుడు ఎన్‌.టి. రామారావుకి చెందుతుంది. తెలంగాణ మీద ఏమాత్రం అభిమానం, బాధ్యతలేని తెలుగుదేశం పార్టీ తెలం గాణ మాతృభాష పేరుని మాత్రం స్వంతం చేసేసుకుంది. పాటలలోని లాలిత్యానికి తేనెలొలికే తెలుగు పదాన్ని కవిగారు తీసుకుం టే, సామాన్య జనాన్ని బుట్టలో వేసుకోవడానికి రాజకీయ నాయకులు చక్కగా ఈ పదాన్ని వాడుకుని, ఆ జాతికి మాత్రం అన్యా యం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రజలు తిప్పికొట్టాలి, కొట్టారు కూడా. తెలుగుదేశం అని ఉన్నా అది నిజమైన తెలుగు ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయలేదుకాబట్టి తెలంగాణ ప్రజలు తెలుగుదేశాన్ని పాతరేయాలి. అసలు ఆంధ్రప్రాంతానికి చెందిన ఈ ఆంధ్రజాతి వారి ప్రత్యేకతను కాపాడుకోవాలంటే 'ఆంధ్రుల'మ నే వ్యవహరించుకోవాలి. తెలుగువాళ్ళమని వెన్ను చరుచుకోనవస రం లేదు. ఈ విషయం నన్నయ వగైరా రాసిన భారతాన్ని, తేనెలొలుకే తెలుగులో పోతన రాసిన భాగవతంతో పోలిస్తే తేటతెల్లమవుతుంది. నిజానికి మతాలు వేరైనా ఏకమవడం సాధ్యమేకానీ, భాషా, సంస్క­ృతి వేరైతే వారు కలవడం సాధ్యంకాదు.

పై విషయాలు సరిగ్గా అర్థం చేసుకుంటే ఆంధ్ర సోదరులు వారి పాటని ' ఆంధ్ర తల్లి'కి మొగలిపూదండ అనో, మా ' ఆంధ్రమాత'కి మోదుగపూదండ అనో మార్చుకోవాలి. తెలుగు తల్లి అన్న భావమే తప్పు, అయితే తెలుంగుతల్లి అనండి లేకపోతే తెలంగాణ తల్లి అనండి. ఏరకంగా అన్నా అది తెలంగాణ మాత్రమే అవుతుంది. అంతేకాదు గలగలా పారే గోదావరి, బిరబిర పరుగులెత్తే కృష్ణమ్మ చాలాభాగం తెలంగాణలోనే ఉన్నాయన్న మాట మనం మర్చిపోకూడదు.

ఇకమీదట ఆంధ్ర సోదరులని 'తెలుగు' వారని అనవద్దు. ఆంధ్రవారనే వ్యవహరిద్దాం. వారి జాతి, ఎన్నో తరాలనించీ, ఆంధ్రజాతి. కాబట్టి వారిని ఆంధ్రవారనీ, వారి భాషని 'ఆంధ్ర'మనీ అనడం సబబు. తెలుగువారందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలన్న వారి వాద న తప్పని తిప్పికొడదాం. తెలుగువారందరూ తెలంగాణలోనూ ఆంధ్రవారు ఆంధ్రరాష్ట్రంలోనూ ఉండాలన్న మనవాదననీ బలోపే తం చేద్దాం. తెలంగాణలో ఉండాలంటే మన జిల్లాలలో మాట్లాడే అసలు తెలుగు మాట్లాడాలి. పోతన భాగవతం మనకి ప్రాచీన గ్రంథం కావాలి. కాళోజీ కవిత మన ఊపిరి కావాలి. ఆయన 'గొడవ' మన 'లొల్లి' కావాలి. సగం ఇంగ్లీషు కలిపి ఆంధ్రులు మాట్లాడే భాషని కవి పదాల్లోనే తిరస్కరించాలి.
నీవేష భాషలను నిర్లక్ష్యముగజూచు భావదాస్యంబెపుడు బాసిపోవునురా?..
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు
సకలించు ఆంధ్రుడా! చావవెందుకురా!
ఇంకా కాళోజీ స్పష్టంగా అంటాడు ఎకసక్కెంగా:

నిజాం నవాబు క్రింద చెడిన తెలుగుతనం
గడిచిన పదిహేనేండ్లలో దిద్దబడెను చాలవరకు
ఇపుడు తెలంగాణ అంతటి ఆంధ్రత్వం ఎటుచూచిన
'చా', 'టీ' అయిమసలుతాంది, 'సడకు' రోడ్డై సాగుతున్నది
'అదాలతు' 'కోర్టా'యెను 'ముల్జీం' ముద్దాయాయెను.
'షక్కర్‌' 'సుగర'యి పోయెను ఉప్పు 'సాల్టు'గా మారెను.
తెలంగాణ సంస్క­ృతిమీద ఆంధ్రులదాడి ఈ విధంగా వర్ణించాడు:
ఆంధ్రుల సంస్క­ృతి సభ్యత తెలంగాణ కబ్బుతాంది.
లాగూ షేర్వానీలు మాని తెలంగాణ వారు
తీరపోని దారిబట్టి వేషాలు వేస్తున్నారు;
అందరికీ 'ఆంధ్రత్వం' సోకి ఆడిస్తున్నది.
తెలుగువారి మీద 'తీరపోని' అంటే కోస్తా జిల్లాల సవారీ ఇలా సాగుతోంది.
ఆంధ్రుల సభ్యత సంస్క­ృతి రెండున్నర జిల్లాలది
ఆటలు, పాటలు అన్నీ రెండున్నర జిల్లాలవి
తక్కినోళ్లు తెలుగుతనం కోల్పోయిన దౌర్భాగ్యాలు.
ఈ రకంగా కవి హృదయం తల్లడిల్లింది. మనభాష, మన సంస్క­ృతి కాపాడుకుందాం. తెలుగుతల్లిని కాకుండా తెలంగాణ తల్లిని కొలుద్దాం. తెలుగు అన్నది భాష మాత్రమే; ప్రాంతం తెలం గాణ కాబట్టి తెలుగుతల్లి అనడంలో అర్థం లేదు. తెలంగాణ తల్లి అందాం. మన తల్లి కోసం, మన భాషలో పోరాడుదాం.
జై తెలుగు! జై తెలంగాణ!

Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu etymology Andhra Telangana word root tenugu trilinga telungu telinga


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


1 Comments:

At 2:43 AM, Anonymous Anonymous గారు చెప్పినారు...

telugu veru andhram veru antunna o prabhuddhuda, vati lipi okatae elaga ayyindoyi.
Danda karanya krindi prantham antae andhra prantam matramae kaadu, koncham nee bhougolika gnananni vistharinchukuntae manchidi.

Bharatha mata anae stree rupam kevalam kalpana, deeni adugujadalaloonae telugutalli rupam, renditi udhesaam ikamatyam: idi neeku ardham ayyae vishayam kadulae.

Prapanchanni paalinchina Angla Samrajyam Balam eka Bhasha( ye prantha charitra choosina vidipoyi bagupadda kadhalae levu)

samasya prantham, bhasha kaadu: nayakulaki nibadhatha lekapovatam,prajalaku asalu samasya pye avagahana lopam, mariu" elanti rechagottae tappudu prchuranalu".

ettlu

sagatu telugu bhashabhimani

 

Post a Comment

<< Home