తెలుగీకరణ-తేట తెలుగు
- ఇంవయ్యో శతాబ్ధి ఆరంభంలో ఆధునిక పధ నిర్థేశం చేసిన వాడు గురజాడ . ఆయన అడుగుజాడ ననుసరించి తర్వాతి తరం వెంటనే ముందుకు సాగడానికి మరో పాతికేళ్లు పట్టింది. యీలోపున మరో ఉద్యమం. దీనికి అంకురార్ప ణ చేసినవాడు రాయప్రోలు. ఆయన గురజాడలాగా మొత్తం సంప్రదాయాన్ని త్రికరణ శుద్దిగా పాటించలేదు.సంప్రదాయాన్ని తప్పించేడు. సంప్రదాయాన్ని మార్చేడు. కవిత్వ ప్రవాహగతిని మళ్లించేడు గురజాడ సాహిత్య వారసత్వాన్ని పద రచయితల కంటే ఎక్కువగా వచన రచయితలే అనుసరించేరు.అని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు అన్నారు.గురజాడని అనుసరించి వచ్చిన తక్షణ తరం విషయంలో ఈ మాట సరైనదేనని చెప్పాలి. ఏమంటే -రాయప్రోలు వారి ననుసరించి సవ్యకవులు భావ కవిత్వ లక్ష్యాన్ని అందుకున్నారు. ఈ వారసత్వాన్ని అంది పుచ్చుకున్నారు. ఆసమయంలో గురజాడా రాయప్రోలూ ఇద్దరూ నవ కవిత్వానికి కొంచెం ఇంచుమించులో ఏకకాలంలోనే నూతన పధనిర్ధేశం చేశారు. కాని ఎవరి గేయం కొత్త బాణిలో ముందు వచ్చిందీ, ఎవరి ప్రభావం తరవాతి తరం వాళ్ల మీద ఎంత వున్నదీ అన్నదే ముఖ్యం ఈరకంగా చూసినపుడు తన తక్షణ తరంమీద రాయప్రోలు వారి ప్రభావం యెక్కువ అని చెప్పాలి.రాయ ప్రోలు వారి భావ కవిత్వం అని వ్యవహరించే రీతికి ఆద్యులు. ఆయన కవిత్వ గతిని మార్చేడు. కవిత్వ ధాతువు పరిపుష్టం చేశాడు. ఆయన శ్రీకారం చుట్టిన నవ్య కవిత్వ రీతి లక్షణాలు యేమిటి? దీనికి యోన్నో విర్వచనాలు వచ్చేయి. భావం లేకుండా కవిత్వం వుంటుందా? అన్న హేాళనలు వినవచ్చేయి. ఆంగ్ల సాహిత్య చరిత్రలో రొమాంటిక్ పొయిట్రీ అంతకు పూర్వం వున్న క్లాసిసిజమ్ మీద ముఖ్యంగా వర్డ్స్ వర్త్ లాంటి కవులు ప్రకృతిని దర్శించి , ప్రకృతే దేశికత్వం చేస్తుంది అన్న బోధనతో కొత్త మార్గాలు అనుసరించేరు. పట్టణనాగరికత , కృత్రిమత్వం మౌలిక మానవ సంబంధాల్ని విలువలనీ కలుషితం చేస్తూవున్నాయి. దాంతో వాటిమీద తిరుగుబాటుగా ప్రకృతి సౌందర్యం గ్రామీణ జీవిత సౌందర్యం, కల్లా కపటంలేని అనుబంధాల ప్రతిబింబించాలని కవులు తపించేరు. ఆ ప్రయత్నాలలో భాగమే కవిత్వ వస్తువులో, వ్యక్తీకరణలో కవిత్వ భాషలో మర్పు రావడం. భావకవిత్వం ఇంగ్లీషు రొమాంటిక్ ఉద్యమానికి తూగుతుంది. అసలు వివరించుకోవాలంటే కాల్పనిక ఉద్యమం అని చెప్పుకోవాలి.ఇంగీషులో లిరికల్ పొయిట్రీ అన్నదానికి లలిత కవిత్వ అనాలి. తెలుగులో ఈ పదాలు అర్థాన్ని అందించే భావనలో భావకవిత్వం అని స్థిరపడింది. అయినా యే నిర్వచనమూ సొడ్డు పెట్టడానికి లేకుండా వుండదు. మొత్తం మీద చూడాల్సింది ఏ అంతస్సారాన్ని ఆ పదాలు ప్రతిబింబిస్తున్నాయి. అన్న విషయాన్ని భావపదం భావగీతం అన్న పదాలు రాయప్రోలు వారి కవిత్వంలో మొదట కనిపించేయి అని రావుగారు సృష్టంచేరని అంటున్నారు. ఏమైనా ముందు అలాంటి ధోరణంటూ వుంటే కదా పేరు పెట్టేది? వ్యవహార సౌలభ్యం కోసం ఆపేరు పెట్టుకుంటాం. ఆ తర్వాత ఆరకంగానే వాడుతూ వస్తా. కాని ఆ ధోరణి లక్షణాలు, విశిష్ట అంశాలు ముందు రావాలి! ఈ రీతిలో చూస్తే హృదయాను బూతి ప్రధమస్థానంలో వుంటుంది. సహజత్వం పునాదిగా వుంటుంది. కవి అంతరంగ స్థితి, ఆవేశం, తపన మాటల్లో దూకుతూ వస్తాయి. లాక్షణిక నియమాలు, కట్టు బాట్లు, గిరిగీసిన గీతలు యేవీ ఆటంకం కావు. అలా నిర్బ ందించే నియమాలని లెక్క చెయ్యకుండా కట్టుబాట్లు ఆంక్షలు నియమాలు ఏమిటి?
- అలా నిర్బ ంధించే నియమాలని లెక్కచెయ్యకుండా స్వేచ్ఛ కావాలంటాడుకవి. ''నేనే '' అనే భావన ముంచ్చెత్తుకు వస్తూవుంటే ఈ కట్టుబాట్లూ ఆంక్షలూ నియమాలూ మేమిటి? నామీద అని విరుచుకుపడతాడు. ఈ ''నేను'' అనేది వ్యక్తిగా ఆ ఫలానా కవే కానక్కర్లేదు. అది ఇంగ్లీషులో ఇంపర్స్‌నల్ ''ఐ'' అనే దానికి పర్యాయమైంది ఆకవి ఆ నేనులో స్వేచ్చను తీవ్రంగా కాంక్షస్తూ వెల్లడవుతాడు. ఉత్తమ పురుషకు అతీతమైన నేను అనేది మిది.యిక్కడ సమిష్టి త్రిబింబించదు. ఈ భావననుసరించి సృజనాత్యక సృష్టి రూపు తీసుకుంటుంది.అనుభూతి స్పందన ముఖ్యం అవుతుంది. వీటన్నింటికీ మకుటంగా లిరిసిజం వస్తుంది. కవిత్వం చమత్కారం చిందించే స్థాయిని దాటి హృదయాను భూతి పల్లవించే భావన విస్తరించింది. స్త్రీ భోగవస్తువు కాదు- ప్రేమ జీవిత మాధుర్యం తెలియచెప్పే సుకుమార మూర్తి అని కీర్తించడం వచ్చింది. రాయప్రోలు వారు ఇలాంటి నవకవ రీతికి మార్గం వేశారు. ఆయన సాహిత్య కృషిని గురించి ముచ్చటించుకునే ముందు ఆయన జీవితవిశేషాల్ని రేఖామాత్రంగా చూద్దాం:
- ఆయన 1892లో గుటూరు జిల్లా గార్లపాడులో జన్మించేరు. హైస్కూలు బాపట్లలో. తర్వాత రాజమండ్రిలో కొనసాగించేరు. శాంతినికేతన్‌లో రవీంధ్రనాధ్ టాగూర: దగ్గర వున్నారు. బెంగాలీ, హిందీ భాషలు నేర్చుకున్నారు. ఇంగ్లీషు కావ్యాలను చదివేరు. రవీంద్రుని సన్నిధి శిష్యరికం మీద పడి అవధానాలు చేసినా ఆ దారి నుంచి మళ్లేరు. తన త్రిభను ప్రదర్శించే నవ్య రీతుల వైపు వచ్చేరు. ఆయన జీవితంలో కూడా పై మెట్ల యోక్కేరు. ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖకు ఆచార్యులయేరు. ఆయన శిష్యులు కవులుగా విమర్శకులుగా ప్రఖ్యాతులయేరు. ఆయన బోధనలోనే కాకుండా నవ్యకవితా సీమలో కూడా నిజంగా ఆచార్యులయేరు. ఆయన గురజాడలాగా సర్మాత్మానా ఆధునికమైన దానికి అంకితం కాలేదు. కాని సాంప్రదాయాన్ని తప్పించి కావ్యరీతిలో కొత్త దారులు దానికి అంకితం కాలేదు. క్షీణయుగంలో పుట్టిన బొమ్మజముడు ముళ్ల మొక్కల్ని పీకి పారేశారు.
- శబ్దాడంబరం,అలంకార శృంఖలాలు పాండిత్య ప్రదర్శన విస్తరించుకున్న వాతావరణం ఆయనతో మారిపోయింది. ఆయన తీసుకున్న వస్తువు నూటికి నూరుపాళ్లు కొత్తది. ధీరోదాత్త, ధీరలలితాది. లాక్షణికమైన కావ్యనాయిక నాయక పాత్రలకి ఉద్వాసన జరిగింది. సామాన్యులు ఆయన కావ్య పాత్రలు కావ్య కధలు నిత్యజీవితంలో కనిపించేవే. యే మెరుగులూ, నగిషీలూ, పూతలూ లేని సహజత్వం ఆయన కవిత్వంలో ప్రతిఫలించింది. ఆయన అవధానక్రీఢనుంచి ఆవు కవితా సన్యాసం ఇప్పించమని ఇష్టదేవతలు ప్రార్ధిస్తూ ''రమ్యాక్షర ్షోణికిన్ తనన్'' '' త్రిప్పు జననీ ''అని వేడుకున్నాడు.ఈ రకంగా ఆయన కవిత్వం ప్రణాళికకు బ్లూ ప్రింట్ అని చెప్పవచ్చు. రసం భావం చక్కని శబ్ధ సమాస రచన స్వందింపజేసే ప్రతిష్టా కధావసరం వుండే రమ్యాక్షర రచనామార్గంలోనే నడిచేరు. రచన అనుసరించాలని ఆయన కోరుకున్నారు. ఆయన ఇంగ్లీషు నుంచి గోల్డ్‌స్మిత్ హెార్మిట్‌కి అనుసరణగా ''లలిత'' కావ్యం రాశారు. తృణకంకణం, కష్టకమల, స్నేహలత అనే కావ్యాలు రాశారు.ఆంధ్రావని, జడకుచ్చులు వనమాల లనే ఖండకావ్యాలు రాశారు. రస మాధురీ దర్శనం అనే లక్షణ కావ్యం రాశారు. రూప నవనీతం అనే గ్రంధం రాశారు.ఇందులో ప్త్రీ మనస్తత్వం పరిశీలనాత్యక తత్వ ప్రతిపాదన వుందంటారు.
Telugu Andhra Pradesh
2 Comments:
ahaa adbutamgaa undandi ee post
off white jordan
off white hoodie
supreme outlet
off white
golden goose sale
Post a Comment
<< Home