Thursday, January 08, 2009

మేటాస్ మెట్రో ఒప్పందం రద్దు?


హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్‌ పతనావస్థకు చేరిన నేపథ్యంలో మేటాస్‌ కూడా ఆర్థికంగా బలహీనపడిందని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. మేటాస్‌కు అప్పగించిన హైదరాబాద్‌ మెట్రో రైలు, కృష్ణా జిల్లా బందరులో ఓడరేవు పథకాలను రద్దుచేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మెట్రో రైలు ఒప్పందానికి సంబంధించి గతంలో ఢిల్లీ మెట్రో రైలు ఎండీ శ్రీధరన్‌ సంచలన వ్యాఖ్యలుచేశారు. ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో విమర్శలు మళ్లీ చెలరేగితే రాజకీయంగా దెబ్బతింటామన్నది వైఎస్‌ సర్కారు ఆందోళనగా కనిపిస్తోంది. సత్యం కంప్యూటర్స్ లో వేల కోట్ల అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని రామలింగరాజు ఒప్పకోవడంతో ఈ ప్రాజెక్టుల సందిగ్ధంలో పడిపోయాయి. మెట్రో ప్రాజెక్టుతో పాటు, విశాఖపట్నం వద్ద సత్యంకు కేటాయించిన యాభై ఎకరాల విషయంలోనే ఇదే వైఖరిని అవలంభించవచ్చని తెలుస్తోంది. నాలుగు కంపెనీలతో కూడిన మేటాస్ కన్సార్టియం మెట్రో ప్రాజెక్టును దక్కించుకుంది. ఇందులో 52 శాతం కన్సార్టియం భాగస్వామ్యం కాగా, 11 శాతం రాష్ట్ర ప్రభుత్వానిది. అంతర్జాతీయంగా సత్యం ప్రతిష్ట దెబ్బతినడంతో మెటాస్‌ సంస్థలతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.

Courtesy: TeluguOne
hyderabad metro rail maytas satyam

2 comments: