రెడ్‌హిల్స్, జూన్ 18 : కూచిపూడి నృత్య చరిత్రలోనే ప్రప్రథమంగా అమెరికాలోని సిలికాన్ వ్యాలిలోని 'క్యూపర్టినో'లో అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నారు. సిలికాన్ ఆంధ్ర ఆధ్వర్యంలో మూడురోజుల పాటు జూన్ 20, 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు సాంస్కృతిక శాఖ సౌజన్యాన్ని అందిస్తూ కళాకారుల ప్రయాణ నిమిత్తం 15 లక్షలు విడుదల చేసిందని సాంస్కృతిక శాఖ అధికారులు తెలిపారు.
ప్రపంచంలోని 20 దేశాల నుంచి సుమారు 1500 మంది నృత్య కళాకారులు ఈ సమ్మేళనంలో పాల్గొననున్నారు. మన రాష్ట్రం నుంచి డాక్టర్ శోభానాయుడు, కళాకృష్ణ, మంజు భార్గవి, డా.జొన్నల గడ్డ అనూరాధ, వేదంతం రామలింగ శాస్త్రి, స్వాతి సోమనాథ్, స్వప్న సుందరి, పి.రమాదేవి, ఆనంద శంకర్ జయంత్ , వేదాంతం సత్యనారాయణ శర్మ, ఉమారామారావు, మృణాళిని తదితరులు పాల్గొంటున్నారని సాంస్కృతిక శాఖ వారు తెలిపారు.
Courtesy: AndhraJyothy
International Kuchipudi Convention 2008 Cupertino Bay Area America USA Telugu Andhra Classical Dance
No comments:
Post a Comment