Wednesday, October 31, 2007

ఆంధ్రప్రదేశ్ 51వ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు


హైదరాబాద్‌, నవంబర్‌ 1 : నేడు రాష్ట్రావతరణ దినోత్సవం. చెల్లాచెదురుగా ఉన్న తెలుగువారిని ఒక్క తాటిపై నిలిపేందుకు తెలుగు భాషకు గౌరవం కల్పించేందుకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ పొట్టిశ్రీరాములు తన ప్రాణాలనే త్యాగం చేశారు. నేటికి తెలుగువారికి ఓ రాష్ట్రం ఏర్పడి 51 సంవత్సరాలు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆనాటి నాయకుల సేవలను కొనియాడారు. రాష్ట్రవతరణ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇందులో పాల్గొని ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి వివరించారు. పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జలయజ్ఞ ఫలాలు రైతులకు త్వరగా అందేలా చూస్తామని, దీనిగురించి వ్యవసాయశాఖ ప్రచారం చేపట్టాలన్నారు. అయితే జలయజ్ఞానికి కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయన్నారు. ఉచిత విద్యుత్‌ సాధ్యమేనని తాము నిరూపించామన్నారు. నిరుద్యోగ యువతకోసం రాజీవ్‌ ఉద్యోగశ్రీని పక్కాగా అమలుచేస్తామన్నారు. వరికి మద్దతుధర పెంచాలని కోరుతూ కేంద్రానికి ముందే లేఖ రాశామని, దీనిపై తిరిగి ఈనెల 11న ఢిల్లీ వెళ్లి ప్రయత్నిస్తామన్నారు.
Courtesy: ఈనాడు

1 comment:

  1. Kidney donor needed urgently, My client is urgently in need of a kidney transplant, If interested to sell contact here on my what'sApp number +4915219253693 Or Email: kidneydeal@gmail.com

    ReplyDelete