Tuesday, September 13, 2005

తిక్కన భారతం లోని పద్యాలు

ద్రౌపది కృష్ణుడి తో రాయబారం ముందు ఆడిన మాటలు

నెట్టన యిట్టి యల్క మది నిల్పితి రక్కెస తాల్మి చిచ్చొడిం
గట్టిన యట్లు పెద్దయును గాలము దీనికి నారుటెన్నడున్‌
పుట్టదు దుష్ట నిగ్రహము పూని జగంబులు గాచునట్టి తో
బుట్టువు నీవు తేజమున బొల్చిన భర్తలు గల్గ నచ్యుతా!

పెంపేదం దమకిట్టి తక్కువలు రూపింపంగ నేలా ? విచా
రింపన్‌ వారిక మేలు సంధి. తము వారిం జూచినన్‌ తారు సా
ధింపన్‌ జాలరొ ? కాక పోరఁ దగ మర్దింపన్‌ దలంపేని శం
కింపన్‌ బట్టొకొ ? వారు బ్రాహ్మణులె యే కీడైన సైరింపగాన్‌

వరమున బుట్టితిన్‌, భరత వం శము జొచ్చితి నందు పాండు భూ
వరునకు కోదలైతి జన వంద్యుల బొందితి నీతి విక్రమ స్థిరులగు పుత్రులన్‌ బడసితిన్‌ సహ జన్ముల ప్రాపు గాంచితిన్‌
సరసిజ నాభ ! యిన్నిట బ్రశస్తికి నెక్కిన దాన నెంతయున్‌ !
నీవు సుభద్ర కంటె కడు నెయ్యము గారవంఉందలిర్ప సం

భావన్‌ సేయుదిట్టి నను పంకజ నాభ యొకండు రాజసూ
యావ భృదంబునందు శుచియై పెను పొందిన వేణి వట్టి యీ
యేవురు చూడగాఁ సభకు నీడ్చె కులాంగన నిట్లొనర్తురే ?!
ఇవి దుస్సశేను వ్రేళ్ళం

దవిలి సగము త్రెవ్వి పోయి తక్కిన యవి కౌ
రవుల కడ తీరు మాటల
యవసరమున తలప వలయు నచ్యుత వీనిన్‌ !

No comments:

Post a Comment