Sunday, July 24, 2005

అమ్మభాషలోనే ప్రాధమిక విద్య

బాపట్ల, జులై 23 (న్యూస్టుడే): పసి పిల్లలకు అమ్మ భాషలోనే ప్రాధమిక విద్యను నేర్పాలని పలువురు వక్తలు సూచించారు. జనవిజ్ఞాన వేదిక, భావపురం తెలుగు భాషోద్యమ సమితి ఆధ్వర్యంలో శనివారం బాపట్లలో ప్రాధమిక విద్య స్థాయిలో తెలుగు-ఇంగ్లీషు మాద్యమాలు ఏది సమాజానికి ప్రయోజనకరం అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. ఈ వేదికకు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.వెంకటేశ్వరరెడ్డి సమన్వయ కర్తగా వ్యవహరించగా, సాహితీవేత్త జ్వాల నరసింహశాస్త్రి అధ్యక్షత వహించారు. తెలుగు భాషోద్యమం అంటే ఇంగ్లిష్ వ్యతిరేక ఉద్యమం కాదు. భాషా విద్య విధానం విషయాలలో ప్రభుత్వానికే ఒక స్పష్టమైన విధానం లేదు. ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించాలనుకోవడాన్ని విరమించుకోవాలి. పిల్లలకు 5వ తరగతి వరకు తల్లిభాషలోనే నేర్పాలి. సెకండరీ స్థాయి నుంచి 10 సంవత్సరాల తర్వాత ఆంగ్ల భాషగాని, మరో భాష మాద్యమంలోకి మారటం సమంజసమని పలువురు సూచించారు. వేదికలో ఎ.నరసింహారావు, దారా బాబూరావు, పి.మోషే, పి.శరత్శ్రీనివాస్, సి.హెచ్‌.టి.వి.సురేష్, ఎస్.రామరాజు, డి.వి.సుబ్బారావు, పూర్ణచంద్రరావు తదితరులు ప్రసంగించారు.

Courtesy: ఈనాడు

No comments:

Post a Comment