Tuesday, June 28, 2005

తెలుగు భాష అమలు జీవో ఏది?

హైదరాబాద్‌,జూన్‌28(ఆన్‌లైన్‌): ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలన్న ప్రభుత్వ ఉత్తర్వును ఎవరూపట్టించుకోవ డం లేదని ఆంధ్రప్రదేశ్‌ అధికారభాషా సంఘం అధ్యక్షుడు ఎబికె ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మాధ్యమ పాఠశాలల్లో తెలుగును విధిగా బోధించాలని , త్రిభాషాసూత్రాన్ని అనుసరించాలని ప్రభుత్వం 2003లో జీవో86 ఉత్తర్వును విడుదల చేసిందని ఆయన ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.కానీ ఆ ఉత్తర్వు అమలవుతుందా..?లేదా..? అని తనిఖీచేసేందుకు ప్రత్యేకంగా అధికా రులెవ్వరూ లేరని ఆయన పేర్కొన్నారు. దీంతో జీవో నామమాత్రంగా మిగిలి పోయిందని ఆయన విచారం వెలిబుచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రాథమికస్థాయిలోనే ఇంగ్లీష్‌ మాధ్యమాన్ని మొదలు పెట్టడం దురదృష్టకర మ న్నారు. 1,2తరగతుల్లోనే ఇంగ్లీషును బోధనాభాషగా అమలు చేయడం వల్ల అటు తల్లిభాషకు, ఇటుపరాయి భాషకు దూరమయ్యే పరిస్థితి నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Courtesy:ఆంధ్రజ్యోతి

No comments:

Post a Comment