Thursday, June 09, 2005

అమెరికాలో అన్నమయ్య ఆరాధనోత్సవాలు


The Hindu American Religious Institute (HARI) Temple in New Cumberland, PA celebrated the 596th birth anniversary of Sri Tallapaka Annamacharya, the mystic Telugu poet saint of 15th century, on 4th June '05.

The following is the article in the 9th June '05 issue of Eenadu, which covered the event.

(ఈనాడు-ఇంటర్‌నెట్‌ డెస్క్‌)



దకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య జయంతిని పురస్కరించుకొని అమెరికాలోని ప్రవాస భారతీయులు 'శ్రీ తాళ్లపాక అన్నమాచార్య ఆరాధనోత్సవాల్ని' ఘనంగా నిర్వహించారు. అన్నమాచార్య 596వ జయంతి సందర్భంగా ఈనెల 4వ తేదీన పెన్సిల్వేనియాలోని హేరీస్‌బర్గ్‌ కేంద్రంగా పనిచేస్తున్న 'ది హిందూ అమెరికన్‌ రెలిజియస్‌ ఇన్‌స్టిట్యూట్‌' (HARI - హరి) ఆధ్వర్యంలో అన్నమాచార్య ఆరాధనోత్సవాలు జరిపారు.
శ్యామలా రామస్వామి పాడిన ప్రార్థనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమం అనంతరం పలువురు చిన్నారులు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలతో ఆద్యంతం రసవత్తరంగా సాగింది. రవి వేంకటసుబ్రమణ్యం, మినా వెంకట్‌, శ్రీకృష్ణ రాధిక తదితరులు వాయిద్య సహకారం అందించగా పలువురు చిన్నారులు సభ్యులు ఆలపించిన కీర్తనలు శ్రవణానందాన్ని, భక్తి రసాన్ని పంచాయి. 'హరి' అధ్యక్షుడు రే కేధరేశన్‌ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు సభ్యులకు అభినందనలు తెలిపారు. ఇకపై ఆరాధనోత్సవాల నిర్వాహణ ప్రతి సంవత్సరం జరగాలన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. స్థానిక హిందూ దేవాలయం అధ్యక్షులు ప్రీతిపాటిల్‌ మాట్లాడుతూ అన్నమయ్య పాటల్లోని మాధుర్యాన్ని వివరించారు. వచ్చే ఆరాధనోత్సవాల నాటికి తాను ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటానని తెలిపారు. చివరిగా ఈ కార్యక్రమ రూపకర్తలు శ్రీకృష్ణ రాధిక, సీతారామస్వామి తదితరులను సభ్యులు ముక్తకంఠంతో అభినందించారు. కార్యక్రమానంతరం దేవాలయంలో నిత్యం జరిగే హారతి, ప్రసాద వినియోగాలతో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.

1 comment: