"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Saturday, January 20, 2007

C.P.Brown's photograph: A rare acquisition for TTD's archives

ఈ చిత్రంలో మధ్యలో కూర్చున్నది బ్రౌన్‌. ఆయనకు ఎడమవైపున ముద్దలరాజు వెంకటసుబ్బారావు, కుడి వైపున చెంగల్‌రావు వున్నారు.
REMEMBERING A LUMINARY: A photograph of the legendary British Collector of Kadapa, C.P.Brown (sitting middle), taken about 175 years ago during his visit to Gurramkonda in Chittoor district


ఈయనే మన సీపీ బ్రౌన్‌
ఇన్నాళ్లకు ఫొటో దొరికింది


తిరుపతి, న్యూస్‌టుడే: పై ఫొటోలో ఉన్న వ్యక్తి తెలుగు భాషాభివృద్ధికి విశేష సేవలందించిన సీపీ బ్రౌన్‌ మహాశయుడు. ఇంతకాలం ఆయన రేఖాచిత్రాన్నే మనం చూస్తూ వచ్చాం. ఇటీవల చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన సంజీవిగారి సుబ్బారావు ఇంట్లో ఆయన అసలైన ఫొటో లభ్యమైంది. ఈ అరుదైన ఫొటోను తితిదే శ్వేత ప్రాజెక్టు డైరెక్టర్‌ భూమన్‌ శనివారం తిరుపతిలో పత్రికలకు విడుదల చేశారు. ఇటీవల తాము తిరుమలేశుని భక్తురాలు, కవయిత్రి తరిగొండ వెంగమాంబ గ్రామాన్ని సందర్శించినప్పుడు సాలిగ్రామ శ్రీనివాసాచార్యుల ద్వారా ఈ విషయం తెలుసుకుని అయిదు తాళపత్ర గ్రంథాలతోపాటు బ్రౌన్‌ చిత్రాన్ని సేకరించినట్లు తెలిపారు. ఆ రోజుల్లో ఎల్లుట్ల కడప జిల్లాలో ఉండేదని.. కడప జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన బ్రౌన్‌ భూసంబంధ వ్యవహారాలపై ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు తీయించుకున్న ఫొటో కావచ్చని చెప్పారు. ఇది దాదాపు 150-175 ఏళ్ల నాటిదని భూమన్‌ తెలిపారు.

తెలుగుజాతి ముద్దు బిడ్డ: బ్రౌన్‌ జన్మభూమి ఏదైనా.. తెలుగు తల్లి ఒడినే తన కర్మభూమిగా మలుచుకున్నారు. 'ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌'గా పిలిచే తెలుగు భాష సౌందర్యం మరింత వన్నెలీనడానికి కృషి చేశారు. తొలి ఇంగ్లిషు-తెలుగు, తెలుగు-ఇంగ్లిషు నిఘంటువులను (డిక్షనరీ) రూపొందించారు. మరుగున పడిన స్థానిక తెలుగు పదజాలానికి పునరుజ్జీవనం కల్పించారు. వేమన పద్యాలను సేకరించి గ్రంథస్తం చేయించిన మహానుభావుడాయన. విదేశీయుడైనా.. తెలుగువారి కన్నా మిన్నగా ఈ భాషాభివృద్ధికి ఆయన చేసిన కృషి చూస్తే.. తెలుగు భాష ఆయనకు రుణపడి ఉంది అంటే అతిశయోక్తి కాదేమో!

Courtesy: ఈనాడు
*****

Archives receives legendary C.P. Brown's photograph

TIRUPATI: Here's some good news for those who were longing to see the photograph of the legendary British Collector of erstwhile Kadapa -- C.P. Brown. It was a chance acquisition even for the TTD's Digital Library, which now claims that it has secured the rare photograph passed on to its director, Bhuman, by one Saligrama Srinivasacharyulu of Valmikipuram.

Mr Bhuman had recently led a TTD contingent to Tarigonda village -- the birthplace of the saint-poetess Tarigonda Vengamamba for a function arranged to commemorate her works in praise of Lord Venkateswara. It was on this occasion that he casually broached with the Acharyulu about Brown's photograph still evading all those who are on a hunt for the same.

Unsuccessful search

Some of the big names in the Telugu literary world, who were engaged in the `search mission', according to Mr Bhuman were Arudra, Bangore and Janumaddi. But their efforts also did not meet with any success with the result that barring speculative or imaginary portraits, so far not even a single photograph of Brown could be secured until the Acharyulu passed on one to the head of the TTD's Digital Library.

The photograph, CDs of which were supplied on Saturday to the local media by Mr Bhuman, was reportedly taken when the high profile Collector with a deep love for Telugu visited, about 150 to 175 years ago, Ellutla village near Gurramkonda, which in those days was under Kadapa district. When Brown visited the village in connection with a land revenue dispute, he had obliged the villagers' request for a group photo with them. Acharvulu visited Ellutla village, traced the descendents of the persons in the photo and secured not only Brown's photo but five volumes of palm-leaf manuscripts on some ancient works. That would be studied later.

Courtesy: The Hindu



Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home