Telugu in UC Berkeley: article in Andhra Jyothy
ఆగస్టులో బర్క్‌లీ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం
కాలిఫోర్నియా, జులై 19: బర్క్‌లీ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం ఏర్పాటు కోసం చేస్తున్న కృషికి అమెరికాలోని తెలుగు వారందరూ సహకరించాలని ప్రొఫెసర్ వేమూరి వెంకటేశ్వరరావు పిలువునిచ్చారు. వచ్చే ఆగస్టు నుంచి తెలుగు విభాగం ఏర్పాటుకు బర్క్‌లీ విశ్వవిద్యాలయం సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన నిధుల సమీకరణ కోసం తెలుగువారు తమవంతు సహకారం అందిస్తే, బోధనాంశంగా తెలుగును ప్రారంభించగలమని విశ్వవిద్యాలయం అధికారులు హామీనిచ్చినట్టు ఆయన వెల్లడించారు.
బర్క్‌లీ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం ఏర్పాటు కోసం జరుగుతున్న కృషిలో భాగంగా మిల్ పిటస్ స్థానిక లైబ్రరీ హాలులో జరిగిన సమావేశానికి ఉత్తర కాలిఫోర్నియాలోని బాటా, శాక్రిమెంటో తెలుగు సంఘాలు, సిలికానాంధ్ర వంటి పలు సంస్థల ప్రతినిధులూ హాజరయ్యారు.
విస్కాన్‌సిన్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు ప్రధానాచార్యులుగా తెలుగు విభాగం కొనసాగుతోంది. అదే తరహాలో కాకపోయినా కొద్దో గొప్పో తెలుగును బోధనాంశంగా కోర్సు ప్రారంభించాలంటే ప్రవాసాంధ్రుల చొరవ తప్పనిసరి అని దక్షిణ భారత సాంస్కతిక విభాగం ఛైర్ ప్రొఫెసర్ రాకా రే చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ వేమూరు వెంకటేశ్వరరావు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ బహత్కర కార్యక్రమానికి వెల్చేరు నారాయణరావు ప్రేరకులుగా నిలిచారు.
తెలుగు వారికి గర్వకారణమైన ఈ కార్యానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఇదేమంత కష్టతరమైన విషయం కాదని తానా కార్యదర్శి జయరాం కోమటి అన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన పలువురు తెలుగువారు దాదాపు పదిహేను వేల డాలర్లు తమ విరాళంగా ప్రకటించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ వేమూరి వెంకటేశ్వరరావు తెలుగు విభాగం ముఖ్యోద్దేశాలు, అందుకు జరుగుతున్న కృషికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సభకు హాజరయిన తెలుగువారంతా ఈ కృషికి తమ మద్దతు ప్రకటించారు.
Courtesy: ఆంధ్ర జ్యోతి
university of california andhra pradesh north america department bay area silicon valley
1 Comments:
ray ban sunglasses
ecco outlet
oakley sunglasses
michael kors uk
christian louboutin shoes
colts jerseys
detroit lions jerseys
michael kors handbags
oakley sunglasses
nike roshe
Post a Comment
<< Home