సాగర్‌కు పెరిగిన బౌద్ధులతాకిడి
న్యూస్‌టుడే, మాచర్ల
అమరావతిలో కాలచక్ర ఉత్సవాలు ప్రారంభమై నాలుగు రోజుల గడవడంతో బౌద్ధులు నాగార్జునసాగర్‌కు వందలాదిగా తరలివస్తున్నారు. నాగార్జునకొండ, అనుపు ప్రాంతాలను అపురూపంగా పరిశీలిస్తున్నారు. అమరావతి నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులు, ప్రవేటు వాహనాలలో నాగార్జునసాగర్ చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున 5 గంటలకే సాగర్ చేరే యాత్రికులు రాత్రి 10 గంటల వరకు అక్కడే గడిపి వెనుదిరుగుతున్నారు.
అనుపు నుంచే లాంచీలు
లక్షలాది రూపాయలు వెచ్చించి లాంచీ స్టేషన్ నాగార్జునసాగర్‌లో నిర్మించినా సమయం కలిసి వస్తుండటంతో లాంచీ స్టేషన్ కాస్తా అనుపు వద్దకు మారింది. సాగర్ నుంచి 50 నిమిషాలు పట్టే ప్రయాణం, అనుపు నుంచి 25 నిమిషాలే పడుతుంది. ఈ నెల 35 బౌద్ధమత గురువు దలైలామా అనుపు నుంచే నాగార్జునకొండ చేరుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడ నుంచే లాంచి ప్రాయాణాలు సాగుతున్నాయి. అయితే ఈ సమాచారం తెలియక అనేక మంది బౌద్ధులు తికమక పడుతున్నారు.
బోధి మొక్క వద్ద ప్రదక్షణలు
ఈనెల 3న దలైలామా నాగార్జునకొండలో నాటిన బోధి మొక్క వద్ద బౌద్ధులు భక్తి పారవశ్యంతో మొక్కుతున్నారు. తమ ఆరాధ్య దైవం నాటిన మొక్క దైవంతో సమానంగా మొక్కుతున్నారు. దలైలామా ప్రార్థనలు నిర్వహించిన ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. మ్యూజియంలో ఉన్న అద్భుత సంపద చూసి ఔరా అంటున్నారు.
నింగినంటిన తినుబండారాల ధరలు
భక్తితో వచ్చిన బౌద్ధులకు సాగర్, అనుపులో పలువురు వ్యాపారులు పట్టపగలే చుక్కలు చూపెడుతున్నారు. బౌద్ధులకు భాషా సమస్య ఉండటంతో వ్యాపారులు ఆడిందే ఆటగా సాగుతోంది. రూ.12ల వాటర్ బాటిల్ రూ.20కు, రూ.7 ఉండే శీతల పానీయం బాటిల్ రూ.10 నుంచి రూ.12కు విక్రయిస్తున్నారు. ఇక ఇడ్లి, పూరి, వడ వంటి ధరలు సరేసరి. వచ్చిన కాడికి వసూలు చేస్తున్నారు. స్నాక్స్, పండ్ల ధరలు అధికమే.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005 , Nagarjunasagar, Nagarjunakonda
0 Comments:
Post a Comment
<< Home